ఇండియాలో కరోనా కల్లోలం: ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు, మరణాల నమోదు

By narsimha lodeFirst Published Apr 11, 2021, 10:53 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజెకి పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో కేసుల సంఖ్య భారీగా నమోదైంది. గత ఆరు మాసాల తర్వాత కరోనాతో మరణించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది.


న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజెకి పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో కేసుల సంఖ్య భారీగా నమోదైంది. గత ఆరు మాసాల తర్వాత కరోనాతో మరణించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది.గత 24 గంటల్లో  దేశ వ్యాప్తంగా 14.12 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,52,879 మందికి కరోనా నిర్ధారణ అయింది. 

ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు రికార్డు కావడం ఇదే మొదటిసారి. దేశంలో ఇప్పటివరకు 1,35,58,805కి చేరుకొంది. తాజాగా 90,584 మంది కరోనా నుండి కోలుకొన్నారు.శుక్రవారం నాడు కరోనాతో మరణించిన వారి సంఖ్య 794గా నమోదైంది.  శనివారం నాడు ఈ సంఖ్య మరింతగా పెరిగింది. శనివారంనాడు ఒక్క రోజే 839 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 1,69,275కి చేరుకొంది. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని  కేంద్రం నిర్ణయం తీసుకొంది.దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 8వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోడీ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్నాయి. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నారు. అంతేకాదు కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ కూడ విధించారు.


 

click me!