యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడిన ట్రక్కు, 10 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Apr 10, 2021, 07:52 PM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడిన ట్రక్కు, 10 మంది దుర్మరణం

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది దుర్మరణం పాలవ్వగా... 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారని అంచనా

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడిపోవటంతో 10 మంది దుర్మరణం పాలవ్వగా... 30 నుంచి 35 మంది వరకు గాయపడ్డారని అంచనా.

సమాచారం అందుకున్న పోలీసులు..ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బర్హపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రవెనే ప్రాంతంలో డ్రైవర్‌ ఆ ట్రక్కుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రమాద సమయంలో ట్రక్కులో 40 నుంచి 50 మంది ఉన్నట్టు సమాచారం. మరణించిన వారంతా పురుషులేనని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?