తోడికోడలి మీద కోపం.. తాంత్రికుడితో కలిసి ఆ భార్య చేసిన పనికి.. వణికిపోయిన భర్త...

Published : Aug 19, 2023, 11:38 AM IST
తోడికోడలి మీద కోపం.. తాంత్రికుడితో కలిసి ఆ భార్య చేసిన పనికి.. వణికిపోయిన భర్త...

సారాంశం

టీవీ సీరియల్స్ లో చూపించేలాంటి కుట్రకు తెరలేపిందో ఇల్లాలు. తోడికోడలి మీది కోపంతో తాంత్రికుడితో కలిసి..ఆమె గర్భం పోగొట్టాలని ప్లాన్ వేసింది. 

మహారాష్ట్ర : తోడికోడలిపై కోపంతో దారుణానికి ప్రయత్నించింది ఓ  మహిళ. తాంత్రికుడితో కలిసి మాయోపాయం పన్నింది. భార్య రహస్యంగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండడంతో అనుమానం వచ్చిన భర్త  చాటుగా ఫోన్ వినగా ఈ విషయం వెలుగు చూసింది. ఆ భార్య చేసిన పని భర్తని షాక్ కు గురిచేసింది. ఆమెలో అంత క్రూరత్వం దాగి ఉందని తెలిసి నివ్వెర పోయాడు. చివరికి ఆమె ప్రయత్నాలని వమ్ముచేసి.. పోలీసులకు పట్టించాడు. ఇంతకీ  ఏం జరిగిందంటే…

మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.  స్థానికంగా ఉన్న మాండ్వి ప్రాంతానికి చెందిన వ్యక్తికి వివాహమయ్యింది.  ఆయన భార్యకు, అన్న భార్యకు కొంతకాలంగా గొడవలు  జరుగుతున్నాయి. తోటికోడళ్ళు అంటే అక్కాచెల్లెల్లులా కలిసిపోయి ఉండాల్సింది పోయి..  ద్వేషంతో ఎడమొహం పెడముఖంగా ఉంటున్నారు.

ప్రమాదంలో భర్త కాళ్లు పోయాయని.. దారుణానికి తెగించిన భార్య.. ఆస్తులు లాక్కుని...

తనతో గొడవ పడుతున్న తోటికోడలిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంది సదరు భార్య. దానికోసం అనేక రకాల ఉపాయాలు ఆలోచిస్తూ ఉండేది. భర్త వదినపై ఎలా పగ తీర్చుకోవాలా అని ఎవరెవరుతోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అయితే భర్తకు ఈ విషయంలో ఎప్పుడూ అనుమానం రాలేదు. ఇటీవల తోటికోడలు గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన ఆ మహిళ కోపంతో రగిలిపోయింది.

ఏం చేసైనా సరే…తోటి కోడలికి ఆ సంతోషాన్ని మిగల్చకూడదనుకుంది ఆ భార్య. ఇందుకోసం  పరిచయస్తుల ద్వారా ఓ తాంత్రికుడిని  కలుసుకుంది. తోటి కోడలి గర్భం పోయేలా చేయమని కోరింది. దీనికోసం అతనితో ఒప్పందం చేసుకుంది ఆ ప్రకారం రూ.4వేలు  పంపించింది. అయితే ఇటీవల కొంతకాలంగా ఫోన్ రాగానే భార్య పక్కకు వెళ్తూ ఉండడం, రహస్యంగా మాట్లాడుతుండడం…భర్తకు అనుమానం వచ్చింది.

దీంతో అతడు  ఆమె ఫోన్ కాల్స్ మీద నిఘా పెట్టాడు. ఆరోజు కూడా తాంత్రికుడు ఫోన్ రాగానే ఆమె పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. అది గమనించిన భర్త దొంగచాటుగా ఆమె మాట్లాడేది విన్నాడు. అది విన్న అతను షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు భార్య మీద ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది.
 
దీంతో వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులైతే పెట్టారు కానీ, ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్టు చేయలేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !