ప్రమాదంలో భర్త కాళ్లు పోయాయని.. దారుణానికి తెగించిన భార్య.. ఆస్తులు లాక్కుని...

Published : Aug 19, 2023, 10:57 AM IST
ప్రమాదంలో భర్త కాళ్లు పోయాయని.. దారుణానికి తెగించిన భార్య.. ఆస్తులు లాక్కుని...

సారాంశం

యాక్సిడెంట్ లో కాళ్లు కోల్పోయి.. భర్త వికలాంగుడిగా మారడంతో సేవలు చేయలేక ఆ భార్య దారుణానికి ఒడి గట్టింది. ఆస్తులు లాక్కుని ఇంట్లోనుంచి అతడిని వెళ్లగొట్టింది.   

రాజస్థాన్ : రాజస్థాన్లో అమానుషమైన ఘటన వెలుగు చూసింది. ప్రమాదవశాత్తు భర్త కాళ్లు కోల్పోవడంతో అతనికి సేవలు చేయలేక భార్య  అతడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. ప్రమాదం ఇన్సూరెన్స్ గా వచ్చిన డబ్బులు, ఆస్తులు అన్నింటినీ తన పేరు మీద రాయించుకున్న భార్య వికలాంగుడైన భర్తను చిత్రహింసలకు గురిచేసి వెళ్ళగొట్టింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

ఈ ఘటన రాజస్థాన్లోని అల్వార్ నగరం నౌగవానా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటాకల్ గ్రామంలో వెలుగు చూసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య, పాతికేళ్లు కాపురం చేసిన తర్వాత 48 యేళ్ల వ్యక్తిని వెళ్ళగొట్టింది.  భార్య పేరు జాహిదా. ఆ దంపతులు పెళ్లి తర్వాత.. భర్త కుటుంబం కోసం ఎంతో కష్టపడి ఆస్తులు పోగేశాడు. భార్య పేరు మీద  కొన్ని ఎకరాల భూమి  కొన్నాడు. సొంత ఇల్లు కొన్నాడు. 

షాకింగ్ : ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి.. ఊపిరాడక నలుగురు మృతి...

ఎలాంటి చీకూ చింత లేకుండా సంసారం చక్కగా సాగుతూ ఉన్న క్రమంలో ఓ ఘటన వారి జీవితాలను తలకిందులు చేసింది. 2017లో జరిగిన ఒక ప్రమాదంలో భర్త కాళ్లు కోల్పోయాడు. అప్పటినుంచి వికలాంగుడిగా మంచానికే పరిమితమయ్యాడు. కొంతకాలం భార్య అతనికి బాగానే సేవలు చేసింది. కానీ కాలం గడుస్తున్నా కొద్దీ ఆమెలో కూడా మార్పు వచ్చింది.

భర్తకు సేవలు చేయడం ఆమెకు కష్టంగా మారింది. దీంతో అతన్ని వదిలించుకోవాలనుకుంది జాహిదా. అయితే, అంతకుముందే రోడ్డు ప్రమాదం కారణంగా కాళ్లు కోల్పోయినందుకు గాను భర్తకు రూ.14 లక్షలు  సొమ్ము క్లెయిమ్ గా వచ్చింది. ఆ మొత్తం సొమ్మును భార్య తీసేసుకుంది. ఆ తర్వాత భర్త తన పేరుతో కొన్న భూమిని కూడా అమ్మేసి.. సోదరులతో కలిసి పంచుకుంది. ఇల్లును తన సొంతం చేసుకుంది. 

ఇవన్నీ అయిపోయిన తర్వాత భర్తకి నరకం చూపించడం మొదలు పెట్టింది. దీనికి పిల్లలు కూడా తోడయ్యారు. కాళ్లు లేకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో భర్త ఇవన్నీ సహించాడు. చివరికి ఓ రోజు భార్య, పిల్లలు అతని ఇంటి నుంచి గెంటేయడంతో సదరు భర్త  నౌగావాన్  పోలీసులను ఆశ్రయించాడు. భార్యతో పాటు పిల్లల పేరు మీద ఫిర్యాదు చేశాడు. తన ఆస్తి అంతా కాజేసి తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.   

ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన తర్వాత భార్య కొద్ది రోజులు బాగానే చూసుకున్నా ఆ తర్వాత మారిపోయిందని తెలిపాడు. రోజు తిట్టడం,  కొన్ని సార్లు కొట్టడం కూడా చేసేదని బోరున విలపించాడు. సొంత కొడుకులు కూడా… తన పరిస్థితికి జాలి పడకపోగా.. భార్యకే సహకరించారని ఆరోపించాడు. ఈ మేరకు తనకు న్యాయం జరగాలని,  తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించాలని ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !