
Violence Against Women: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం.. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. నిత్యం ఎదోక చోట చిన్నారులపై దాడులు జరుగుతునే ఉన్నాయి. ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కామాంధులు.. వావి వరుస లేకుండా.. పనిపిల్లల నుంచి పండుముసలి వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు. యువతులుపై అఘాయిత్యాలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా.. బస్సులో వెళ్తున్న ఓ మహిళ పట్ల ఓ ఆకతాయి అనుచితంగా ప్రవర్తించాడు. మహిళను ఇష్టానుసారంగా తాకుతూ.. వింతగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ సేప్టీ పిన్ తో గుచ్చి గుణపాఠం చెప్పింది. ఈ తతాంగమంతా.. రికార్డు చేసి.. పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని చెన్నైలో ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న 28 ఏళ్ల యువతి లైంగిక వేధింపులకు గురైంది. తన తోటి ప్రయాణికుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఓ యువతి చెన్నై నుంచి వెల్లూరుకు బస్సులో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో తన వెనుకల కూర్చున్న ఓ ఆకతాయి.. ఆ యువతిని అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడు. తొలుత ఏదో పొరపాటున జరగవచ్చనని భావించిన ఆ యువతి పట్టించుకోకుండా విడిచి పెట్టింది. ఆ యువతి తనని ఏం అనడం లేదుగా అని మరోసారి అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా సదరు మహిళ.. ఆ కామంధుడిని సేఫ్టీ పిన్‌తో ఎదుర్కుంది. ఆ ఘటన మొత్తాన్ని తన ఫోన్ లో రికార్డు చేసింది ఆ మహిళ. అనంతరం ఆ కామాంధుడిని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని కృష్ణగిరికి చెందిన రాఘవన్ (40)గా గుర్తించారు.
చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ ఎక్కిన ఆ నిందితుడు తన వెనుక సీటులో కూర్చోని వేధించడం ప్రారంభించాడని, మొదట్లో పొరపాటున తాకాడని భావించనని..కాసేపటి తర్వాత సీటు వెనుక నుంచి చేతులు జారి ఆమెను అనుచితంగా తాకేందుకు ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సమస్యను లేవనెత్తినప్పుడు.. కొంతమంది ప్రయాణీకులు తమకు ఆలస్యం అవుతుందని, తనను, నిందితుడిని బస్సు నుండి దిగమని ప్రయాణికులు సూచించారని తెలిపింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డడనే దానికి సాక్ష్యంగా ఆ వీడియోను చిత్రీకరించానని ఆమె తెలిపింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా పాయింట్ టు పాయింట్ బస్సుల్లో బస్సు కండక్టర్లను నియమించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నమని పోలీసులు తెలిపారు.