సింహం తలను నిమిరుతున్న మహిళ... వీడియో వైరల్..!

Published : Oct 28, 2022, 10:30 AM IST
సింహం తలను నిమిరుతున్న మహిళ... వీడియో వైరల్..!

సారాంశం

 ఓ మహిళ ఏదో పెంపుడు పిల్లి, కుక్క పెంచుకుంటే.... దానిని నిమరడం లాంటివి చేస్తూ ఉంటామో.... అలా  ఆమె పెద్ద సింహాన్ని నిమరడం  గమనార్హం.

సింహం అంత దూరంలో కనపడితే మీరు ఏం చేస్తారు...? భయంతో పడిపోతారు కదా. అంతెందుకు సింహం జూలో  ఉన్నా సరే.. దానితో మనం ఆటలు ఆడం. దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయం. దూరం నుంచే చూస్తాం. కానీ ఓ మహిళ.. సింహం పక్కన ధైర్యంగా నిలపడింది. అంతేనా... దానిని ఏదో పిల్లి పిల్లను నమిరినట్లు నిమిరడం గమనార్హం.  ఆమె ధైర్యానికి ఇప్పుడు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన  వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ ఏదో పెంపుడు పిల్లి, కుక్క పెంచుకుంటే.... దానిని నిమరడం లాంటివి చేస్తూ ఉంటామో.... అలా  ఆమె పెద్ద సింహాన్ని నిమరడం  గమనార్హం. ఈ వీడియో ని ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆమె ధైర్యాన్ని కొందరు మెచ్చుకుంటూ ఉంటే.... మరి కొందరు ఆమె చేస్తున్న పనికి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇంత ప్రమాదకరమైన సాహసం ఎవరైనా చేయగలరా అని కొందరు ప్రశ్నిస్తుంటే.. అలా పని చేయడం అవసరమా..? ఒక వేళ సింహం తిని ఉంటే ఏం చేసేది అంటూ కొందరు విమర్శిస్తుండటం గమనార్హం. ఈ వీడియోలో సింహాలు బోనులో ఉన్నాయి. ఆ సింహాలు... చైన్ గొలుసుతో కట్టేసి ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో '@k4_khaleel' అనే పేజీలో ఈ వీడియోని షేర్ చేయడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu