ప్రీవెడ్డింగ్ షూట్ కోసం..దంపతుల ఫీట్... ఫోటోలు వైరల్..!

Published : Oct 28, 2022, 09:42 AM IST
ప్రీవెడ్డింగ్ షూట్ కోసం..దంపతుల ఫీట్... ఫోటోలు వైరల్..!

సారాంశం

రకరకాల ఖరీదైన దుస్తులు ధరించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటారు. తాజాగా ఓ జంట కూడా అలానే చేసింది. 

పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయించుకోవడం చాలా కామన్ అయిపోయింది. కొందరు అయితే... హీరో హీరోయిన్లలా పాటలకు డ్యాన్స్ లు కూడా చేస్తున్నారు. రకరకాల ఖరీదైన దుస్తులు ధరించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటారు. తాజాగా ఓ జంట కూడా అలానే చేసింది. అయితే.. అందుకోసం బైక్ మీద స్టంట్స్ చేసింది. పెళ్లి దుస్తుల్లో బైక్ మీద కూర్చొని పైకి జంప్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 


ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో, కొన్ని ఫోటోలను షూట్ చేయడానికి వధూవరులు బైక్‌పై కూర్చొని ఉన్నారు. వారి బైక్ ని క్రేన్  పట్టుకొని ఉంది. వారు ఎక్కిన బైక్... కారు మీద నుంచి పైకి పోయే విధంగా ఆ సెటప్ చేశారు.  నిజానికి కొద్దిగా స్లిప్ అయినా కూడా బైక్ మీద నుంచి వారు పడిపోతారు. అంత డేంజర్ గా ఉంది ఆ స్టంట్. అలాంటి స్టంట్ ని ప్రీవెడ్డింగ్ షూట్ కోసం వారు ప్లాన్ చేసుకోవడం గమనార్హం. బాలీవుడ్ సినిమా ని చూసి ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ ఫీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టుకి 435వేల వ్యస్ వచ్చాయి. కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ని డైరెక్ట్ చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu