రోడ్డు బాగాలేదని అంబులెన్స్ నిరాకరణ.. మంచంపై హాస్పిటల్‌కు తీసుకెళ్లుతుండగా మహిళ మృతి

By Mahesh K  |  First Published Nov 18, 2023, 8:51 PM IST

రోడ్డు బాగాలేదని పేషెంట్‌ను హాస్పిటల్ తీసుకెళ్లడానికి అంబులెన్స్ నిరాకరించింది. ప్రైవేటు వాహనాలు కూడా ముందుకు రాలేదు. దీంతో ఆమెను మంచంపైనే మోసుకెళ్లారు. కానీ, హాస్పిటల్ చేరేలోపే మార్గం మధ్యలోనే ఆమె మరణించింది.
 


కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరోసారి విస్మయకర ఘటన జరిగింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను హాస్పిటల్ తీసుకెళ్లడానికి రోడ్డు బాగాలేదని అంబులెన్స్, ఇతర వాహనాలు నిరాకరించాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మంచం మీద నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోని చిన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అనుకున్నారు. వారు ప్రయాణం ప్రారంభించి కొద్ది దూరం వెళ్లిన తర్వాత మార్గం మధ్యలోనే ఆమె మరణించింది. ఈ ఘటనతో మరోసారి రాష్ట్రంలో అభివృద్ధి అంశంపై చర్చ మొదలైంది.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మాల్దంగా గ్రామానికి చెందిన 25 ఏళ్ల మాముని రాయ్ తీవ్ర అనారోగ్యం బారిన పడింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నది. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు అంబులెన్స్ సేవలను సంప్రదించారు. ఇతర ప్రైవేటు వాహనాలనూ సంప్రదించారు. కానీ, రోడ్డు బాగాలేదని చెబుతూ వారంతా నిరాకరించారు.

Latest Videos

Also Read: RBI: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ కన్నుమూత.. 1990ల సంక్షోభ, సంస్కరణల సమయంలో బాధ్యతలు

కుటుంబ సభ్యులు మాముని రాయ్‌ను మంచంపై పడుకోబెట్టి ఆమెను మోసుకుంటూ మొడిపకుర్ రూరల్ హాస్పిటల్‌కు బయల్దేరారు. ఈ హాస్పిటల్ వారి గ్రామం నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
 

click me!