పెళ్లైన మూడు నెలలకే...

By ramya neerukondaFirst Published Nov 19, 2018, 10:31 AM IST
Highlights

దీపావళి పండగకు బంగారం పెట్టలేదనే కోపంతో భర్త, అత్తమామలే ఆమెను హత్య చేసినట్లు యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.
 


పెళ్లైన మూడు నెలలకే వివాహిత అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన సంఘటన  తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.  దీపావళి పండగకు బంగారం పెట్టలేదనే కోపంతో భర్త, అత్తమామలే ఆమెను హత్య చేసినట్లు యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్‌ కుమార్తె రూపవతి(29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ సత్తరై గ్రామానికి చెందిన కృష్ణస్వామి నాడార్‌ కుమారుడు యువరాజ్‌తో గత సెప్టెంబర్‌ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్‌ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. 

ఈ క్రమంలో గత దీపావశికి యువరాజ్‌ దంపతులు కాంచీపురం వెళ్లారు. వివాహమై మొదటి దీపావళి కావడంతో పెళ్లికొడుకుకు బంగారు నగలు ఇవ్వడం సంప్రదాయం. అయితే ఇటీవల వివాహం చేసి ఉండటంతో డబ్బు సరిపడా లేక.. కొత్త అల్లుడికి బంగారం పెట్లలేకపోయారు.

ఇది సాకుగా చూపి యువరాజ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడని సమాచారం. ఈ వేధింపులు తట్టుకోలేక రూపవతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంగారం పెట్టాలని కోరింది. ఇలోపుగానే ఆమె ఆమె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది.

కడుపులో నొప్పిగా ఉందని.. హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపు చనిపోయిందని భర్త యువరాజ్ చెప్పడం గమనార్హం. రూపవతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!