రెండో భార్య చేతిలో రియాల్టర్ దారుణ హత్య.. అందుకోసమే హత్య చేసిందంటున్న మొదటి భార్య...

Published : Nov 10, 2021, 02:49 PM IST
రెండో భార్య చేతిలో రియాల్టర్ దారుణ హత్య.. అందుకోసమే హత్య చేసిందంటున్న మొదటి భార్య...

సారాంశం

స్వామి రాజ్ తన మొదటి భార్య నుంచి విడిపోయి బ్యూటీషియన్ అయిన నేత్ర (35) ను second marriage చేసుకున్నాడు. ఇటీవల తన భర్త తనని శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఈ క్రమంలోనే మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు.

రెండో భార్య చేతిలో ఓ రియల్టర్ హత్యకు గురైన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. రియాల్టర్ ను  అతని రెండో భార్యే కొట్టి హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది. అనంతరం ఆ మహిళ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. కర్ణాటకలోని మంగళూరు జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్వామి రాజ్ తన మొదటి భార్య నుంచి విడిపోయి బ్యూటీషియన్ అయిన నేత్ర (35) ను second marriage చేసుకున్నాడు. ఇటీవల తన భర్త తనని శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఈ క్రమంలోనే మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. దీంతో నేత్ర షాక్ అయ్యింది. తాను అలా చేయలేనని.. అలాంటిదాన్ని కాదని బతిమాలుకుంది. అంగీకరించక పోవడంతో ఈ విషయమై వారిద్దరి మధ్య గొడవ కూడా జరిగింది.

సహనం కోల్పోయిన ఆమె అతను నిద్రిస్తున్న సమయంలో తన భర్తను murder చేసి పోలీసులకు లొంగిపోయింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్య మీద రాజ్ మొదటి భార్య వెర్షన్ వేరేలా ఉంది. రాజ్ అలా చేసి ఉండడని ఆమె అనుమానంవ్యక్తం చేస్తోంది. నేత్ర, రాజ్‌లకు ఐదేళ్ల క్రితం marriage అయిందని… ఆస్తి తగాదాల కారణంగా తరచూ గొడవలు జరుగుతుంటాయని.. ఇదే హత్యకు కారణమని రాజు మొదటి భార్య సత్య కుమారి పోలీసులకు  తెలిపింది. ఆమె మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందని.. ప్రొఫెసర్ భార్యను కిరాతకంగా చంపిన డ్రైవర్..

ఆస్తి కోసం.. భర్తను చంపి, దొడ్డికింద పాతేసి...

అక్రమ సంబంధాలు, కుటుంబ సమస్యలు, మనస్పర్థలు ఇలా కారణం ఏదైనా ఈ మధ్యకాలంలో భర్తను హతమారుస్తున్న భార్యలు పెరుగుతున్నారు. తాజాగా ఓ భార్య ఆస్తి తగాదాలతో భర్తను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోని మరుగుదొడ్డి కింద పాతి పెట్టింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం దర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల చిన్నంబావి గ్రామానికి చెందిన చిన్నయ్య(45) ఇటీవల తనకున్న ఆస్తిని అమ్మేసి ఓ ఇంటిని నిర్మించి తన చెల్లెళ్లకు ఇచ్చాడు.

ఈ విషయంపై చిన్నయ్య అతని భార్య రాములమ్మ మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త చేసిన పనితో విసుగు చెందిన రాములమ్మ ఆగ్రహంతో చిన్నయ్యను హత్య చేసి తన ఇంట్లోనే మరుగుదొడ్డి కింద పాతిపెట్టింది. అయితే గత రెండు నెలలుగా చిన్నయ్య కనిపించకపోవడంతో అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో చిన్నయ్యను చంపింది రాములమ్మే అని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం రాములమ్మ చెప్పిన వివరాల మేరకు పోలీసులు మరుగుదొడ్డి ఉన్న ప్రాంతంలో జేసీబీ సాయంతో ఇంటిని కూల్చేసి.. చిన్నయ్య మృతదేహాన్ని వెలికితీశారు. ఆపై రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?