మహారాష్ట్రలోని భండారా జిల్లా సావర్ల గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకొంది. పులి దాడిలో గాయపడిన భార్యను తన భుజాలపై అరకిలోమీటరు దూరం మోసుకొచ్చాడు భర్త. అయితే ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో భర్త కళ్ల ముందే ఆమె ప్రాణాలను విడిచింది.
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని భండారా జిల్లా సావర్ల గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకొంది. పులి దాడిలో గాయపడిన భార్యను తన భుజాలపై అరకిలోమీటరు దూరం మోసుకొచ్చాడు భర్త. అయితే ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో భర్త కళ్ల ముందే ఆమె ప్రాణాలను విడిచింది.
మహారాష్ట్రలోని భండారా జిల్లా పౌని తాలుకా సావర్ల గ్రామానికి చెందిన మమత షిండేకు 38 ఏళ్లు. ఆమె భర్త నరేష్. అడవి సంపద సేకరించుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అడవిలో ఇప్పపువ్వు సేకరించేందుకు ఆదివారం నాడు వెళ్లారు.
ఇప్పపువ్వు సేకరిస్తున్న మమతపై పెద్దపులి దాడి చేసింది. ఈ సమయంలో మమత పెద్దగా అరిచింది. ఆమె అరుపులు విన్న భర్త నరేష్ కర్రతో పులిని వెంబడించాడు. మమతను పులి వదిలేసి వెళ్లిపోయింది.
also read:ఇండియాపై కరోనా పంజా: 24 గంటల్లో 1,553 కేసులు, మొత్తం 17,265కి చేరిక
తీవ్రంగా గాయపడిన మమత తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన మమతను తన భుజాలపై వేసుకొని నరేష్ అడవి నుండి అరకిలోమీటరు దూరంలోని రోడ్డుపైకి వచ్చాడు.లాక్ డౌన్ కారణంగా వాహనాలు నడవడం లేదు. గాయపడిన మమతను ఆసుపత్రికి తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో రోడ్డుపైనే మమత ప్రాణాలు విడిచింది.
ఈ విషయం తెలుసుకొన్న అటవీశాఖాధికారి వివేక్ సంఘటనస్థలానికి చేరుకొన్నాడు. అయితే అప్పటికే మమత చనిపోయింది. ఆమె మృతదేహాన్ని అటవీశాఖాధికారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.