లాక్ డౌన్ ఉల్లంఘనలు: కేరళపై కేంద్రం సీరియస్

Published : Apr 20, 2020, 10:25 AM ISTUpdated : Apr 20, 2020, 10:27 AM IST
లాక్ డౌన్ ఉల్లంఘనలు: కేరళపై కేంద్రం సీరియస్

సారాంశం

కేరళ ప్రభుత్వం రెండో జోన్లలో లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది.

న్యూఢిల్లీ:  లాక్ డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్టారెంట్లను, బుక్ షాపులను ఈ రోజు నుంచి తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది లాక్ డౌన్ నిబంధనల ఉలంఘన కిందికి వస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

కేరళ ప్రభుత్వం రెండు జోన్లలో కోవిడ్ -19 లాక్ డౌన్ ఆంక్షలను సడలిచింది. ప్రైవేట్ వాహనాలను సరి, బేసి సంఖ్యలో అనుతించింది. సోమవారం నుంచి హోటల్స్ లో భోజనాలు చేయడాన్ని కూడా అనుతించింది.

స్థానిక వర్క్ షాపులను, కార్లలోని వెనక సీట్లో ఇద్దరు ప్రయాణికులను, టూవీలర్స్ పై ఇద్దరిని అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ ఆంక్షలను కొనసాగించాలని సూచించింది. ఆ నేపథ్యంలో కేరళపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది.

కరోనా వైరస్ కట్టడికి కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన మర్నాడే కేంద్రం ఆంక్షల సడలింపుపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు