తన ఇంట్లోనే శవంగా మారిన మహిళా జర్నలిస్టు..!

Published : Mar 25, 2022, 10:17 AM IST
 తన ఇంట్లోనే శవంగా మారిన మహిళా జర్నలిస్టు..!

సారాంశం

ఆమె మరణించే సమయంలో ఆమె భర్త కేరళలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే, శృతి తల్లిదండ్రులు , బంధువులు ఇది హత్య కేసుగా అనుమానించారు, 

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆమె ఉరి వేసుకొని చనిపోయినట్లు చెబుతున్నారు. అయితే.. ఆమె భర్తపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన శృతి నారాయణన్ (35) బుధవారం తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని కనిపించింది. జర్నలిస్ట్ కేరళకు చెందిన అనీష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా.. దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఆమె మరణించే సమయంలో ఆమె భర్త కేరళలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే, శృతి తల్లిదండ్రులు , బంధువులు ఇది హత్య కేసుగా అనుమానించారు, 

శృతి నారాయణ  మీడియా సంస్థలో పనిచేస్తుండగా.. ఆమె భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా..  ఆమె తన జీతంలో కొంత మొత్తాన్ని తన పుట్టింటికి పంపిస్తోందని.. ఈ విషయం నచ్చని ఆమె భర్త.. ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం.

శృతి భర్త తన కదలికలను పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలను అమర్చాడని, జనవరిలో ఆమెను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని శృతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో.. రెండు రోజులుగా శ్రుతి వద్ద నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu