మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా..

Published : Mar 25, 2022, 09:40 AM IST
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా..

సారాంశం

మద్రాస్ హైకోర్ట్ నూతన న్యాయమూర్తిగా శ్రీశ్రీ కుమార్తె నిడుమోలు మాలా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. 

చెన్నై :  సుప్రసిద్ధ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె  నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు  అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. Madras High Court న్యాయవాదుల కోటాలో  ఆరుగురు పేర్లను Supreme Court Collegium సిఫార్సు చేయగా వీరిలో  మాలా, ఎస్. సౌందర్ ల  పేర్లకు  రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి రాజేందర్ kashyap  గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ శ్రీ సరోజ దంపతుల నలుగురు సంతానంలో చిన్నవారైన మాలా మద్రాస్ లా కళాశాల నుంచి డిగ్రీ పొందారు. ఆమె 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో నమోదయ్యారు. 32 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.

 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వం న్యాయవాది(జీపీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాల భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉన్నతాధికారిగా ఉన్నారు. వారిది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా. మాల-రాధా రమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ జయప్రకాష్ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా తొమ్మిదిమందిని దేశంలోని ఐదు హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించింది. వీరిలో  ఆరుగురు న్యాయవాదులు, మిగిలిన ముగ్గురు జుడీషియల్ అధికారులని న్యాయ మంత్రిత్వ శాఖ  గురువారం ట్వీట్ చేసింది.

న్యాయవాదులైన రాహుల్ భర్తీ, మోక్షా ఖజూరియా కాజ్మీలను జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. మొదట వీరిలో ఖాజ్మీని  2019 అక్టోబర్ లో, రాహుల్ ను గతేడాది మార్చిలో  సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఈ ఇద్దరి పేర్లను గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. దీంతో  గతేడాది చివరిలో వీరిద్దరి పేర్లను మరోసారి సుప్రీం కొలీజియం సిఫారసు చేయగా ఎట్టకేలకు కేంద్రం ఇప్పుడు ఆమోదించింది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet:మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet Telugu
PM Modi Speech: రౌడీలు, గూండాలు మర్యాదగా లొంగిపోండి బెంగాల్లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu