షాక్: మహిళా ఐఎఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు

First Published Jun 11, 2018, 11:04 AM IST
Highlights

మహిళా ఐఎఎస్ పై సీనియర్ లైంగిక వేధింపులు

చంఢీఘడ్:  ఓ సీనియర్ ఐఎఎస్ అదికారి తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళా  ఐఎఎస్ అధికారి  ఆరోపించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ లో పోస్టు చేశారు.   తన కార్యాలయానికి పిలిపించి సీనియర్ ఐఎఎస్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె  ఆ పోస్టులో పేర్కొన్నారు.


ఈ ఏడాది మే 22 వ తేదిన తన కార్యాలయానికి పిలిపించుకొని మరీ ఆయన తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. ఆయా విభాగాలు చేసిన తప్పుల గురించి ఎందుకు రాస్తున్నావని ఆయన ప్రశ్నించారని ఆమె చెప్పారు.  ఈ రకమైన నివేదికలు ఇవ్వడం ఆపకపోతే  సర్వీసు రికార్డుల్లో తప్పుడుగా రాయనున్నట్టు బెదిరించారని  ఆమె చెప్పారు. 

అదే నెల 31వ తేదిన మరోసారి తనను గదిలోకి పిలిపించి ఇతరులెవ్వరిని రాకుండా నిలిపివేయాలని అటెండర్ ను ఆదేశించారని ఆమె చెప్పారు. ప్రతీ విషయం నీకు నవ వధువుగా  వివరించాల్సి వస్తోందని సీనియర్ ఆఫీసర్ తనపై కామెంట్ చేశారని చెప్పారు. అంతేకాదు ఈ నెల 6వ తేదిన కూడ తన కార్యాలయానికి పిలిపించి రాత్రి 8 గంటలకు తన వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారని ఆమె చెప్పారు. ఈ వ్యవహరంపై రాష్ట్రపతి కార్యాలయానికి ఈమెయిల్ పంపినట్టు ఆమె ఫేస్ బుక్ పోస్టులో వెల్లడించారు.

తనపై మహిళా ఐఎఎస్ అధికారిణి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. మహిళా ఐఎఎస్ అధికారిణి తన కార్యాలయంలో ఉన్న సమయంలో  తన కార్యాలయంలో ఎవరో ఒకరు ఉండేవారని ఆయన గుర్తు చేశారు.తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు.

click me!