మూడు పెళ్లిళ్లు.. ఆరు ఛాటింగులు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కిలాడీ లేడీ...

Published : Mar 24, 2022, 09:44 AM IST
మూడు పెళ్లిళ్లు.. ఆరు ఛాటింగులు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కిలాడీ లేడీ...

సారాంశం

ఓ కిలాడీ లేడీ అంతులేని మోసాలకు తెరలేపింది. ఏకంగా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ భర్తల దగ్గర డబ్బులు లాగుతూ..  ఆ తరువాత విడాకులు తీసుకుంటోంది. మూడో భర్తకు అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

మైసూరు : Tinder app ద్వారా పురుషులతో పరిచయం ఏర్పరచుకుని ప్రేమ పేరుతో దగ్గర కావడం ఆపై marriage చేసుకుని కొన్నాళ్లకు విడిపోవడమే పనిగా పెట్టుకుంది ఓ లేడి. మూడో భర్త ఆమె నిర్వాకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..  మైసూరులోని ఉదయగిరికి చెందిన నిధాఖాన్ గత రెండువేల పంతొమ్మిదిలో బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే ఆజమ్ఖాన్ తో పరిచయంపెంచుకుని పెళ్లి చేసుకుంది.

కొన్నిరోజులకే నిధా ఖాన్ ప్రవర్తన తేడాగా ఉండడంతో ఆజంఖాన్ ఆరా తీశాడు. ఆమె అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిందని గుర్తించాడు. ఆన్లైన్లో మరికొందరు పురుషులతో చాటింగ్ చేస్తోందని మైసూరులోని ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తితో ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇలాంటి ఘటనే నిరుడు ఫిబ్రవరిలో తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగింది. ఐపీఎస్ అధికారిని అని చెప్పి.. తన చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీధైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. 

ఆమె ఈ మోసాలు తన బంధువుతో కలిసి చేసింది. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శృతిసిన్హా అనే యువతి ఐపీఎస్ అధికారిణిగా చలామణీ అవుతోంది. ఈ క్రమంలో వీరారెడ్డి అనే వ్యక్తిని కలిసింది. అతడి సోదరుడికి తన చెల్లిని ఇచ్చి వివాహం చేస్తానని శృతిసిన్హా నమ్మించింది. ఈ క్రమంలో అతడి వద్దనుంచి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె తన బంధువు విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది. 

అయితే నెలరోజుల కిందట విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వ్యవహారం బయటకు పొక్కింది. వీరారెడ్డితో వసూలు చేసిన  డబ్బుతో ఖరీదైన కార్లను శృతి కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాపుపల్లి పోలీసులు శృతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

నిందితురాలి నుంచి 3 కార్లు, రూ. 6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బారినపడి మోసానికి గురయిన వాళ్లు చాలామంది ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

2020లో కూడా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి వసంతనగర్‌లో నివాసముండే ఉప్పాలపాటి చైతన్య విహారి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో అనుపల్లవి మాగంటి అనే ఐడీ పేరుతో ఉన్న ఓ యువతి 2018లో పరిచయమైంది. అనుపల్లవి తాను అమెరికాలో ఉంటానని, డాక్టర్ గా పనిచేస్తున్నానని నమ్మబలికింది. తన తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ ఉంటూ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పింది. 

అంతేకాదు తల్లిదండ్రులు తనను ఓ పారిశ్రామిక వేత్త కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారని తనకు అది ఇష్టం లేదని ఆమె తెలిపింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఆమె తెలిపింది. అందుకే తన బ్యాంక్ ఖాతా అకౌంట్స్ ఆపేశారని.. వారిమీద న్యాయపోరాటం చేయడానికి డబ్బులు అవసరమని.. చైతన్యను కోరింది. నమ్మిన అతను విడతల వారీగా పెద్దమొత్తంలో ఆమెకు డబ్బులు వేశాడు. ఆ తరువాత అనుపల్లవి కాంటాక్టులో లేకుండా పోయింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్