పిల్లి చేసిన లొల్లి.. 60వేల విద్యుత్ కనెక్షన్లు హాంఫట్.. రూ.100కోట్లు నష్టం...!

Published : Mar 24, 2022, 06:42 AM IST
పిల్లి చేసిన లొల్లి.. 60వేల విద్యుత్ కనెక్షన్లు హాంఫట్.. రూ.100కోట్లు నష్టం...!

సారాంశం

ఓ పిల్లి చేసిన చిన్న పనితో మహారాష్ట్ర ప్రాంతం అంధకారబంధురం అయిపోయింది. 60వేలమంది చీకట్లో మగ్గిపోతున్నారు. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది.. అవునా?? అని ఆశ్చర్యపోకండి.. ఇది నిజం.. 

పూణే :  ఓ cat అమాయకంగా తిరుగుతూ maharashtraలో బీభత్సం సృష్టించింది. వేలాదిమందిని అంధకారంలోకి నెట్టింది. వందకోట్ల నష్టాన్ని కలిగించింది. ఏమీ తెలీనట్టు ‘మ్యావ్’ అంటూ వారి జీవితాన్ని గందరగోళం చేసింది. అయితే ఇదంతా పాపం ఆ అమాయకపు జీవి తెలిసి చేసిందా? రోజూ తిరిగే ప్రాంతంలోకి కాకుండా అంత నష్టాన్ని కలిగించే ప్రాంతానికి ఎలా వచ్చింది? అసలు అదేం చేసింది? ఇంతలా నష్టం వచ్చేంతగా చేసిన తప్పేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

’పిల్లి శాపాలకు ఉట్టి తెగదు’  అన్నది సామెత. కానీ మహారాష్ట్రలోని పూణే పట్టణ శివారు పింప్రీ- చించ్వడ్  ప్రాంతంలో  ఏకంగా 60 వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోయాయి. అంతేనా?...  అక్కడున్న పారిశ్రామిక ప్రాంతం భోసారిలో ఏకంగా ఏడు వేల మంది వ్యాపారులు విద్యుత్ అంతరాయం తో ఇబ్బందులు పడ్డారు.  ఫలితంగా వీరికి జరిగిన నష్టం రూ. వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంతకీ ఏం జరిగింది?  అంటే..  ఓ పిల్లి  మహా ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్ లోని  ట్రాన్స్ఫార్మర్  మీదికి ఎక్కింది.  షార్ట్ సర్క్యూట్తో భోసారి, భోసారి ఎమ్ ఐ డి సి( పారిశ్రామిక  ప్రాంతం), అకుర్ది  ప్రాంతాల్లో   60 వేల మంది వినియోగదారులకు  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  ఈ ప్రాంత కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్ బెల్ సారె మాట్లాడుతూ..  దక్షిణ విద్యుత్ శాఖ  మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. మరో మూడు రోజుల పాటు పునరుద్ధరణ అవకాశాలు కనిపించడం లేదు.  విద్యుత్తు పొదుపుగా వాడాలని, భారమంతా సింగిల్ ట్రాన్స్ఫార్మర్ల పై పడుతోందని ఆ శాఖ అధికారి జ్యోతి, చిప్టే  స్థానికులకు విజ్ఞప్తి చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu