ఫోటో షూట్ కోసం వచ్చిన మోడల్ పై అత్యాచారం.. మూడురోజులు పాటు బంధించి..!

Published : Dec 07, 2021, 09:40 AM IST
ఫోటో షూట్ కోసం వచ్చిన మోడల్ పై అత్యాచారం.. మూడురోజులు పాటు బంధించి..!

సారాంశం

కేరళ, మలప్పురం జిల్లాకు చెందిన మోడల్.. ఫొటోషూట్​ కోసం కొచ్చిలోని ఓ లాడ్జికి వచ్చింది. ఆ సమయంలో అలప్పుజాకు చెందిన సలీంకుమార్​తో పరిచయం ఏర్పడింది. 

ఫోటో షూట్ కోసం వచ్చిన ఓ మహిళా మోడల్ పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడు రోజుల పాటు లాడ్జిలోనే బంధించి మరీ..అత్యాచారానికి పాల్పడం గమనార్హం. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

Also Read: దారుణం : 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగాలు హుష్ కాకి.. జూమ్ కాల్ లో ఓ సంస్థ నిర్వాకం...

కేరళ, మలప్పురం జిల్లాకు చెందిన మోడల్.. ఫొటోషూట్​ కోసం కొచ్చిలోని ఓ లాడ్జికి వచ్చింది. ఆ సమయంలో అలప్పుజాకు చెందిన సలీంకుమార్​తో పరిచయం ఏర్పడింది. లాడ్జి యజమాని, మరొకవ్యక్తితో కలిసి సలీంకుమార్​.. సదరు మోడల్ కి మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు., అదే లాడ్జిలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం గమనార్హం.

Also Read: బిహార్‌లో నకిలీ టీకా జాబితా.. మోడీ, అమిత్ షా, సోనియా, ప్రియాంక చోప్రాల పేర్లతో కలకలం

 కాగా..తనకు మత్తుమందు కలిపిన కూల్​డ్రింక్స్​ ఇచ్చి సామూహిక అత్యాచారం చేసినట్లు బాధితురాలు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనను వీడియోతీసి తనను బెదిరించినట్లు తెలిపింది.ఈ ఘటన డిసెంబరు 1-3 తేదీల్లో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే సలీంకుమార్​ను అరెస్ట్ చేశామని, మరో ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్