పెళ్ళైన లవర్ తో క్వారంటైన్లో గడపడానికి మహిళాపోలీస్ సూపర్ ప్లాన్

By Sreeharsha Gopagani  |  First Published Jul 17, 2020, 1:07 PM IST

ఒక మహిళా పోలీసుకు కరోనా లక్షణాలుండడంతో క్వారంటైన్ కు వెళ్లాలని సూచించగా ఆమె భర్త అని అబద్ధం చెప్పి పెళ్ళైన వేరే వవ్యక్తితో క్వారంటైన్ సెంటర్లో గడిపింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చే సరికి ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ నివ్వెరపోయింది.


కరోనా విజృంభిస్తున్నవేళ అనుమానితులందరిని, మైల్డ్ లక్షణాలున్న వారందరిని క్వారంటైన్ కి పంపించడం ఇప్పుడొక పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఇలానే నాగపూర్ లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా పోలీసుకు కరోనా లక్షణాలుండడంతో క్వారంటైన్ కు వెళ్లాలని సూచించగా ఆమె భర్త అని అబద్ధం చెప్పి పెళ్ళైన వేరే వవ్యక్తితో క్వారంటైన్ సెంటర్లో గడిపింది. 

ఈ ఘటన వెలుగులోకి వచ్చే సరికి ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ నివ్వెరపోయింది. పెళ్లికాని ఆ యువతిని పోలీస్ ట్రైనింగ్ క్యాంపు లో క్వారంటైన్ లో ఉండమని చెబితే... తనతోపాటుగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తన భర్తను కూడా క్వారంటైన్ సెంటర్ కి తరలించాలని కోరింది. 

Latest Videos

undefined

పోలీసులు సైతం అందుకు అంగీకరించి ఇద్దరిని క్వారంటైన్ కేంద్రంలో ఉండడానికి అనుమతిచ్చారు. ఈ విషయం తెలియని సదరు వ్యక్తి భార్య మూడు రోజులుగా తన భర్త కనబడడం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కమీషనర్ ని కలవగా ఆయన ఫిర్యాదును వేగవంతం చేయాలని ఆదేశించారు. 

ఆ విచారణలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియడంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నేవేరపోయింది. సదరు వ్యక్తి భార్య సైతం ఈ విషయం తెలిసి తీవ్ర కోపంతో ఉన్నప్పటికీ.... ఆ వ్యక్తిని ఇప్పుడు ఇంటికి పంపించడానికి అధికారులు ఒప్పుకోలేదు. అనుమానిత కరోనా లక్షణాలున్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందుకు అతడిని వేరే క్వారంటైన్ సెంటర్ కి తరలించారు. 

గత సంవత్సరం అక్టోబర్లో ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరు కలిసినప్పుడు వారిమధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం వీరిమధ్య సన్నిహిత సంబంధానికి ధరి తీసి ఇలా అది వివాహేతర సంబంధం వరకు వెళ్లిందని అన్నారు పోలీసులు. 

ఇకపోతే... దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 34,956 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 687 మంది మరణించారు.  దేశంలో కరోనా  కేసుల సంఖ్య 10,03,832కి చేరుకొంది.

దేశంలో 3,42,473 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 6,35,757 మంది  కోలుకొన్నట్టుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది.కరోనాతో ఇప్పటివరకు 25,602 మంది మరణించారని కేంద్ర హెల్త్ బులెటిన్ తెలిపింది.

గురువారం నాడు ఒక్క రోజే అస్సాం రాష్ట్రంలో 892 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 20,646కి చేరుకొంది. 

కర్ణాటక రాష్ట్రంలో గురువారం నాడు ఒక్క రోజే 4,169 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 50 వేలకు చేరుకొంది. ఒక్క రోజులోనే 104 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 1031కి చేరుకొంది.

click me!