పదేళ్ల బాలుడు.. 30సెకన్లలో రూ.పదిలక్షలు చోరీ

Published : Jul 17, 2020, 12:07 PM IST
పదేళ్ల బాలుడు.. 30సెకన్లలో రూ.పదిలక్షలు  చోరీ

సారాంశం

30సెకన్లు గడిచేలోపే తన పని పూర్తి చేసుకుని దర్జాగా బ్యాంకు నుంచి బయటికి వెళ్లిపోయాడు. గేటు బయట పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాతే గార్డుకు అనుమానం వచ్చి అతడి వెంట పడ్డాడు. 

వాడి వయసు పదేళ్లు కానీ.. కేవలం కళ్లు మూసి కళ్లు తెరిచేంత కాలంలో.. దాదాపు రూ.పది లక్షలు కాజేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఈ సంఘట మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో జవాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక కో-ఆపరేటివ్‌ బ్యాంకులోకి ఉదయం 11గంటలకు జనాలు నిండిపోయి ఉన్న సమయంలో ఓ బాలుడు ప్రవేశించాడు. పిల్లిలా క్యాషియర్‌ ఉండే క్యూబికల్‌లోకి వెళ్లిన బాలుడు.. అక్కడున్న డబ్బు నోట్లను చక్కగా తన సంచిలో సర్దేసుకున్నాడు. కౌంటర్‌ ఎదురుగా లైన్లో నిల్చుని ఉన్న వారెవరికీ కూడా ఈ బుడతడు కనిపించలేదు. 

30సెకన్లు గడిచేలోపే తన పని పూర్తి చేసుకుని దర్జాగా బ్యాంకు నుంచి బయటికి వెళ్లిపోయాడు. గేటు బయట పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాతే గార్డుకు అనుమానం వచ్చి అతడి వెంట పడ్డాడు. అప్పటికే ఆ బాలుడు మాయమైపోయాడు. 

ఈ తతంగమంతా సీసీటీవీలో నమోదవడంతో వెలుగులోకి వచ్చింది. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దొంగల బృందం తొలుత రెక్కీ నిర్వహించి.. తెలివిగా ఆ బాలుడితో చోరీ చేయించి ఉండచ్చని వారు పేర్కొన్నారు
 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word