లడఖ్‌లో తుపాకీ ఎక్కు పెట్టిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

By narsimha lodeFirst Published Jul 17, 2020, 12:26 PM IST
Highlights

చైనా, ఇండియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల  నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నాడు లడఖ్ కు చేరుకొన్నారు. లడఖ్ వద్ద రాజ్ నాథ్ సింగ్ మెషీన్ గన్ పని చేసే తీరును తెలుసుకొన్నారు.

న్యూఢిల్లీ: చైనా, ఇండియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల  నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నాడు లడఖ్ కు చేరుకొన్నారు. లడఖ్ వద్ద రాజ్ నాథ్ సింగ్ మెషీన్ గన్ పని చేసే తీరును తెలుసుకొన్నారు.

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే కూడా ఉన్నారు.‌ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను మంత్రి కలసి సంఘీభావం తెలపనున్నారు. ఇక ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సఖ్యత నెలకొనేందుకు భారత్‌-చైనా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కమాండర్‌ స్థాయి చర్చలు జరుగుతున్నాయి.

రెండు రోజుల పాటు లడఖ్, జమ్మూ కాశ్మీర్ లలో రాజ్‌నాథ్ సింగ్  పర్యటించనున్నారు. ఇవాళ లడఖ్ లో ఆయన పర్యటన సాగుతోంది. రేపు ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఎల్ఏసీ, ఎల్ఓసీ వద్ద పరిస్థితులను మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యవేక్షించనున్నారు. లేహ్ లో సెక్యూరిటీని మంత్రి సమీక్షించారు. ఈ నెల 3వ తేదీనే లడఖ్ లో మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాలతో ఈ పర్యటన వాయిదా పడింది.

ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాల సైనిక బలగాలు కొంతమేరకు వెనక్కు వెళ్లాయి. ఈ నేపథ్యంలో యథాతథ స్థితిని కొనసాగించేందుకు.. ప్రస్తుతం ఎల్‌ఏసీ వెంబడి నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు రక్షణ శాఖ మంత్రి లద్దాఖ్‌లో పర్యటిస్తున్నారు.
 

click me!