మహిళా కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ లైంగిక వేధింపులు...వీడియోను అడ్డంపెట్టుకుని

Published : Oct 05, 2018, 08:36 PM ISTUpdated : Oct 05, 2018, 08:41 PM IST
మహిళా కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ లైంగిక వేధింపులు...వీడియోను అడ్డంపెట్టుకుని

సారాంశం

మహిళలు, చిన్నారులను ఎవరైనా వేధిస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. అయితే ఇలా రక్షణగా ఉండే మహిళా పోలీసుపైనే ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమెను నిత్యం లైంగికంగా వేదించేవాడు. అయితే ఇలా అసభ్యంగా ప్రవర్తించేది ఏ ఆకతాయో అయితే ఆమే చూసుకునేది. కానీ అతడు కూడా ఓ పోలీసే. దీంతో ఏం చేయాలో తెలీక చివరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.  

బీహార్ రాజధాని పాట్నాలోని ఓ పోలీస్ స్టేషన్లో మిథిలేశ్ కుమార్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇదే స్టేషన్లో మరో మహిళ కూడా కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే ఈమెపై కన్నేసిన మిథిలేశ్ ఎలాగైనా వశపర్చుకోవాలని ఓ పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఆమె అభ్యంతరకరంగా ఉన్న సమయంలో వీడియో తీశాడు.

ఈ వీడియోను చూపించి సదరు మహిళా కానిస్టేబుల్ ను వేధించడం ప్రారంభించాడు. అంతే కాకుండా ఆ వీడియోను పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో తన లైంగిక వాంఛ తీర్చకుంటే మరిన్ని సైట్లలో పెడతానంటూ బెదింపులకు దిగాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు మిథిలేశ్ ను దోషిగా తేల్చారు. దీంతో అతడిపై ఐపిసితో పాటు ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడి నుండి సెల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నారు.  
 
మరిన్ని వార్తలు 

బాలుడితో కానిస్టేబుల్ స్వలింగ సంపర్కం...నెల రోజులుగా స్టేషన్‌కు పిలిచి మరీ

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం