డేరా బాబాకు బెయిల్...అయినా జైళ్లోనే

By Arun Kumar PFirst Published Oct 5, 2018, 7:33 PM IST
Highlights

పంజాబ్ లో డేరా సచ్చ సౌదా పేరుతో ఆశ్రమం నెలకొల్పి భక్తుల చేత పూజలందుకున్న డేరా బాబా జైలుపాలైన విషయం తెలిసిందే. ఆశ్రమంలో జరిగే అఘాయిత్యాలు బైటపడటంతో అతడితో పాటు అతడి పెంపుడు కూతురు కూడా జైలుపాలయ్యింది. అయితే ఈ వివాదాస్పద బాబాకు ఓ కేసులో బేయిల్ లభించిది. అయినా అతడు జైళ్లోనే ఉండనున్నాడు. 

అత్యాచారాలు, మోసం, భక్తులను శారీరకంగా హింసించడం, అక్రమాయుధాలను కలిగివుండటం ఇలా అనేక కేసుల్లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఆశ్రమంలో ఉండే పురుషుల వృషణాలను కోయించాడన్న అభియోగాలు కూడా ఇతడిపై ఉన్నాయి. ఈ కేసులో అతడికి గతంలో కోర్టు శిక్ష విధించింది. తాజాగా ఈ కేసును విచారించిన సిబిఐ కోర్టు ఈ వివాదాస్పద బాబాకు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే ఈ కేసులోనే కాకుండా అనేక కేసుల్లో ఇతడు ముద్దాయిగా ఉన్నాడు. తన వద్దకు వచ్చే భక్తురాళ్లపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో డేరా బాబాకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్ వచ్చినా డేరా బాబా జైళ్లోనే ఉండనున్నాడు. 

 భక్తుల వృషణాలను కోయించాడన్న అభియోగాలపై 2015 లో డేరా బాబాతో పాటు డాక్టర్లు పంకజ్ గార్గ్, ఎంపీ సింగ్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై శుక్రవారం పంచకుల కోర్టులో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. దీంతో ఇవాళ విచారణ జరిపిన కోర్టు డేరా బాబాకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.    
  
click me!