Crime: 7 నెలల్లో..25 మందిని పెళ్లి చేసుకొని...నగలు,డబ్బుతో జంప్

Published : May 20, 2025, 12:06 PM IST
rajastan lady

సారాంశం

ఏడు నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకుని, నగలు, డబ్బుతో ఉడాయించిన 23 ఏళ్ల యువతిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఏడు నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకుని, నగలు, డబ్బుతో ఉడాయించిన 23 ఏళ్ల యువతి అనురాధ పాస్వాన్‌ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టబద్ధంగానే పెళ్లిళ్లు చేసుకుని, కొన్ని రోజుల తర్వాత నగలు, డబ్బు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పారిపోయేదని పోలీసుల విచారణలో తెలిపారు. తాజాగా మే 3న విష్ణు శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది. ఇద్దరు దళారులు  రెండు లక్షలు ఇచ్చి పెళ్లి సంబంధం కుదిర్చారని, ఏప్రిల్ 20న అనురాధతో పెళ్లయిందని, మే 2న ఆమె నగలతో పారిపోయిందని శర్మ చెప్పాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో పనిచేసిన అనురాధ, భర్తతో విడిపోయి భోపాల్‌కు వెళ్లింది. అక్కడ పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే ముఠాలో చేరింది. వాట్సాప్ ద్వారా సంబంధాలు కుదిర్చి, 2 నుంచి 5 లక్షల వరకు దళారులు తీసుకునేవారు.పెళ్లయిన వారం రోజుల్లోనే పారిపోయేది. ఈ ముఠాలో చాలా మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విష్ణు శర్మ ఇంట్లోంచి పారిపోయాక, భోపాల్‌లో గబ్బర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతని దగ్గర నుంచి రెండు లక్షలు తీసుకుందని తెలిసింది.  వరుడిలా వేషం వేసిన పోలీసులు ఆమె వద్దకు  పంపడంతో  దొరికిపోయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?