యూపీలో దారుణం : భార్య గొంతు కోసి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న భర్త..

Published : Mar 11, 2023, 01:25 PM IST
యూపీలో దారుణం : భార్య గొంతు కోసి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న భర్త..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని రతావాలి గ్రామంలో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోసి హత్య చేసి, ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు శనివారం తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని రతావాలి గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హత్య చేసి, ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు శనివారం తెలిపారు. దీనిమీద అలీగఢ్ ఎస్పీ పలాష్ బసల్ మాట్లాడుతూ, "ఒక వ్యక్తి, అతని భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు రతవాలి గ్రామం నుండి సమాచారం అందింది."

"భర్త మొదట తన భార్యను గొంతుకోసి చంపి, ఆపై ఉరివేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని ఆయన అన్నారు. దంపతుల ఇంటి నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై బార్లా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, దీని వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి అధికారులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ జనవరిలో తెలంగాణ లోని హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. హన్మకొండ జిల్ల కాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి అంగీకరించడం లేదని ప్రేయసి గొంతు కోశాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మండలంలోని కడిపికొండలో జరిగింది. మడికొండ పోలీస్ ఇన్ స్పెక్టర్ గుజ్జేటి వేణు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...కాజీపేట మండలం కపిడికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్ (35).. తన గ్రామానికే చెందిన ఓ యువతి (26)ను ప్రేమించాడు. 

బీజేపీకి జై కొట్టిన సుమలత.. సంపూర్ణ మద్దతు ప్రకటన.. కారణం ఇదేనట..

ఆమె కూడా ఇతడిని ప్రేమించింది. అయితే, ఇద్దరి మతాలు వేరు. అందుకే శ్రీనివాస్ ఆమె కోసం మతం కూడా మార్చుకున్నాడు. కొంతకాలం వీరి ప్రేమ బాగానే సాగింది. అయితే పెళ్లి చేసుకుందామనుకునేసరికి యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమకు, పెళ్లికి ఒప్పుకోలేదు.దీంతో ఇద్దరి మధ్య కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి ఇదే విషయంగా శ్రీనివాస్ యువతి ఇంటికి వెళ్లాడు. తమ పెళ్లి గురించి మరోసారి యువతిని నిలదీశాడు. 

తమ కుటుంబ సభ్యులు వద్దంటున్నారని ఆమె అంగీకరించకపోవడంతో.. శ్రీనివాస్ తనతో తెచ్చుకున్నపదునైన ఆయుధంతో యువతి గొంతు, చేయి కోశాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు ఆగ్రహానికి వచ్చి... అతడి మీద దాడి చేశారు. చితకబాదారు. ఈ మేరకు సమాచారం అందండంతో మడికొండ పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. యువతిని వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu