పతంజలి వెల్‌నెస్ సెంటర్‌లో వ్యక్తి ఆత్మహత్య..

Published : Mar 11, 2023, 12:54 PM IST
పతంజలి వెల్‌నెస్ సెంటర్‌లో వ్యక్తి ఆత్మహత్య..

సారాంశం

పతంజలి వెల్ నెస్ సెంటర్ భవనం మీదినుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను కొంతకాలంగా ఇక్కడ డిప్రెషన్ కు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. 

హరిద్వార్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున హరిద్వార్‌లోని పతంజలి వెల్‌నెస్ సెంటర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మెయిన్‌పురికి చెందిన రాజీవ్ కుమార్ గత కొంతకాలంగా డిప్రెషన్‌ కారణంగా ఈ సెంటర్‌లో ఉంటున్నాడు. అంతకుముందు గురువారం నాడు కూడా అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, సమయానికి అతని భార్య చూడడంతో అతడిని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసింది. 

శుక్రవారం తెల్లవారుజామున భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిమీద సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

ల్యాండ్ ఫర్ జాబ్ కేసు: లాలూ ఫ్యామిలీని వెంటాడుతున్న కష్టాలు.. తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసిన సీబీఐ..

భాద్రపద్ ఎస్ హెచ్ వో నితేష్ శర్మ మాట్లాడుతూ... అతని మృతికి సంబంధించిన ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్‌ దొరకలేదన్నారు. రాజీవ్ కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించబడుతోంది. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. 

ఇదిలా ఉండగా, జనవరిలో ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగు చూసింది. బ్రేకప్ అయిందని కారుకు నిప్పంటించాడో వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. 29 ఏళ్ల వైద్యుడు తన మెర్సిడెస్ కారుకు నిప్పంటించిన ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో జరిగింది. కొన్నేళ్ల క్రితం కాంచీపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మాజీ క్లాస్‌మేట్ అయిన తన ప్రియురాలితో బ్రేకప్ అవ్వడంతో డాక్టర్ డిప్రెషన్‌లో ఉన్నారని పరిశోధకులు చెబుతున్నారు. 

అతను తన డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి పునరావాస చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కారుకు నిప్పంటించిన తర్వాత వాహనం లోపల కూర్చున్న వైద్యుడు తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరూ రెగ్యులర్ గా గడిపే చెరువు దగ్గర అదే ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కొంతసేపటి వరకు మంటల్లోంచి బయటకు రాలేదు. ఆ తరువాత ఊపిరాడక బయటపడ్డాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

కారు పూర్తిగా దగ్ధమైంది. సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కారులో మహిళ అతనితో లేదని పోలీసులు తెలిపారు. "ఆమె నెం.ను నంబర్‌ను గుర్తించాం. ఆమె సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నాం. ఆమె అతనితో లేదు" అని పోలీసు అధికారి తెలిపారు. డాక్టర్ కుటుంబం తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉంది. అతని తండ్రి ఈ ప్రాంతంలో సుప్రసిద్ధ సంప్రదాయ బోన్ సెట్టర్.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu