భర్తను వేరే మహిళకు 5 లక్షలకు అమ్మేసిందో భార్య. దీనికోసం రాజీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
కర్ణాటక : కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన అందరినీ షాకింగ్ కు గురి చేసింది. ఓ మహిళ కేవలం రూ. ఐదు లక్షలకు తన భర్తను ఇంకో మహిళకు అమ్మేసింది. ఇది చదువుతుంటే.. శుభలగ్నం సినిమా గుర్తొస్తుంది కదా..ఆ సినిమాలో హీరోయిన్ తన భర్తను కోటి రూపాయల కోసం మరో మహిళకు అమ్మేస్తుంది. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అంటూ ఆ సినిమా వచ్చిన సమయంలో చర్చ కూడా నడిచింది. అయితే.. నిజజీవితంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతాయని నిరూపించింది ఓ గృహిణి..
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. కర్ణాటకలోని మాండ్య దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో.. ఓ మహిళ భర్త.. మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయం ఆ భార్యకు తెలిసింది. దీంతో నిఘాపెట్టిన ఆ మహిళ వారిద్దరిని బెడ్ రూమ్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నిలదీసింది. తప్పు చేసిన భర్తను వదిలేసి.. ఆ ఇద్దరు మహిళలు గొడవ పెట్టుకున్నారు. దీంతో ఈ గొడవ పంచాయితీకి చేరింది. ఆ మహిళ పంచాయతీలో మాట్లాడుతూ..‘నీ భర్త నా దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నాడు.. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఆయనను తీసుకెళ్ళు’ అని చెప్పింది.
ఇంకా వెనక్కి రాని రూ. 10,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు: ఆర్బీఐ
దీనికి మండిపడ్డ ఆ భార్య.. ‘ఇలాంటి భర్త నాకు అవసరమే లేదు. నువ్వే నాకు రూ. ఐదు లక్షలు మనోవర్తి కింద ఇవ్వు. అతడిని నువ్వే ఉంచుకో’ అని చెప్పింది. దీనికి ఒప్పుకున్న సదరు మహిళ నగదు ఇవ్వడానికి ఒక నెల గడుపు కోరింది. దీనికి కూడా ఆ భార్య అంగీకరించింది. పంచాయతీ పెట్టి…వారి ఎదుట చేసుకున్న ఈ ఇద్దరి రాజీ ఒప్పందం పంచాయతీ పెద్దలతో పాటు.. గ్రామస్తులను అవాక్కయ్యేలా చేసింది.