అత్తింటిముందు.. పూజలు చేస్తూ కోడలి నిరసన.. ఏడునెలలు కాపురం చేసి భర్త వదిలేశాడంటూ...

By AN TeluguFirst Published Nov 26, 2021, 11:12 AM IST
Highlights

కొన్నాళ్ల పాటు స్నేహితులుగా మెలిగిన యువతి తపస్విని దాస్, వైద్యుడు సునీత్ సాహు కోర్టు సమక్షంలో Register marriage చేసుకున్నారు. ఆ తర్వాత ఒకే ఇంట్టో కలిసి ఉండి, శారీరరకంగా ఒక్కటయ్యారు. ఇలా దాదాపు 7 నెలలు గడిచిన తర్వాత తపస్వినిని వదిలి సునీత్ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు. 

బరంపురం : ప్రేమ పేరుతో వంచించి, కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్న తన husband డాక్టర్ సునీత్ సాహు cheating చేశాడని ఆరోపిస్తూ బాధితులు తపస్విని దాస్ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. భువనేశ్వర్ లోని స్థానిక బ్రహ్మనగర్ 2వ లైన్ లోని అత్తవారింటి ముందు చేస్తున్న నిరసన దీక్ష గురువారం నాలుగో రోజు కొనసాగింది. 

మార్గశిర గురువారం సందర్భంగా బాధితురాలు సంప్రదాయ వస్త్రాలు ధరించి, అత్తవారింటి మెట్లపైపే పండ్లు, పలహారాలు, పిండి వంటలతో Lakshmi Deviకి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆమె పోరాటానికి ప్రజాసంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. 

కొన్నాళ్ల పాటు స్నేహితులుగా మెలిగిన యువతి తపస్విని దాస్, వైద్యుడు సునీత్ సాహు కోర్టు సమక్షంలో Register marriage చేసుకున్నారు. ఆ తర్వాత ఒకే ఇంట్టో కలిసి ఉండి, శారీరరకంగా ఒక్కటయ్యారు. ఇలా దాదాపు 7 నెలలు గడిచిన తర్వాత తపస్వినిని వదిలి సునీత్ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఇలాంటి ఘటనే నవంబర్ 19న గుంటూరుజిల్లాలోని అమరావతిలో చోటు చేసుకుంది. ఈ దారుణమైన ఘటనలో ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని నట్టేట ముంచాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి Money తీసుకుని రమ్మన్నాడు. తీరా తన దగ్గరకు వచ్చాక యువతిపై Bladeతో దాడి చేసి నగదు పట్టుకుని పరారయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

విజయనగరానికి చెందిన యువతితో శ్రీకాంత్‌కు కొంత కాలంగా పరిచయం ఉన్నది. అదే పరిచయాన్ని ప్రేమగా నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. తన దగ్గరకు వచ్చేయమన్నాడు. ఇవన్నీ నిజమని నమ్మిన ఆ యువతి విజయనగరం నుంచి గుంటూరు వచ్చింది. కానీ, తీరా ఆ యువతి తన దగ్గరకు వచ్చాక ప్లేట్ ఫిరాయించాడు. 

అత్యాచారం చేసిన వ్యక్తితో బాధితురాలు పెళ్లి.. వాళ్లకు ఓ బిడ్డ.. కేసు కొట్టేయాలంటూ కోర్టుకు వెళితే..

ఆ యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడు. అనంతరం ఆమె తెచ్చిన నగదు గల బ్యాగ్‌ను పట్టుకుని పరారయ్యాడు. ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రస్తుతం గాలింపులు జరుపుతున్నారు. గాయపడ్డ యువతి ఇప్పుడు ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.

ఇక, ఉత్తరప్రదేశ్ లో జరిగిన మరో మోసం ఘటనలో నవంబర్ 23వ తేదీన ఓ యువకుడు రైలు కింద పడి suicide చేసుకున్నాడు. ఒక యువతి ఈ  యువకుడిని ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా లక్ష రూపాయలు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలత చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ యువకుడు train tracksపై కూర్చుని తనకు ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ ఒక వీడియో రికార్డు చేసి social mediaలో షేర్ చేశాడు. యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

click me!