UP Elections: నేను ఎవరి ఏజెంట్ నో డిసైడ్ చేసుకోండి.. అసదుద్దీన్ ఓవైసీ..!

By telugu news teamFirst Published Nov 26, 2021, 10:39 AM IST
Highlights

ఈ ఎన్నికల్లో.. పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. అయితే.. ఆయన ప్రకటించిన నాటి నుంచి ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో.. వాటిపై ఆయన స్పందించారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ లపై విమర్శల వర్షం కురిపించారు. తనపై అన్ని పార్టీలు వరసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. అందరూ కలసి ఏకాభిప్రాయానికి రండి అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ లో.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో.. పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. అయితే.. ఆయన ప్రకటించిన నాటి నుంచి ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో.. వాటిపై ఆయన స్పందించారు.

‘ఒవైసీ సమాజ్‌వాదీ ఏజెంట్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనడం మీరు వినే ఉంటారు. ఒవైసీ బీజేపీ ఏజెంట్ అని ఎస్పీ అంటోంది. కాంగ్రెస్ నేను సో అండ్ సో ఈజ్ బీ టీమ్ అని.. విమర్శలు చేస్తున్నారని.. ముందు  నేను ఎవరి ఏజెంట్ అని నిర్ణయించుకోండి" అని ఒవైసీ విలేకరులతో మాట్లాడారు.

గత ఏడాది బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిస్టర్ ఒవైసీని ఓట్ కట్టర్‌గా అభివర్ణించింది కాంగ్రెస్. గణనీయమైన ముస్లిం జనాభా ఉన్న కీలకమైన సీమాంచల్ ప్రాంతంలో ఒవైసీ పార్టీ 20 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఆ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుని ముస్లిం ఓట్లను చీల్చి, ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలనే కాంగ్రెస్ ఆశలను తుంగలో తొక్కింది.

ఆందోళనకరంగా కరోనా కొత్త వేరియంట్... జాగ్రత్త: రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య హెచ్చరిక

కాంగ్రెస్‌కు చెందిన రణ్‌దీప్ సూర్జేవాలా ఆయనను "బిజెపి ఏజెంట్" అని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒవైసీని సమాజ్‌వాదీ పార్టీ ఏజెంట్‌గా అభివర్ణించారు. ఎస్పీ ఏజెంట్‌గా ఒవైసీ భావాలను రెచ్చగొడుతున్నారని అందరికీ తెలుసునని, అయితే ఇప్పుడు యూపీ అల్లర్లకు కాదు, అల్లర్లు లేని రాష్ట్రంగా గుర్తింపు పొందిందని ఆదిత్య నాథ్ పేర్కొన్నారు.

Also Read: Rajasthan Bride: ఈ వధువు చేసిన పనికి ఎవరైనా సలాం చేయాల్సిందే..!

కాగా.. ప్రతి  ఒక్కరూ తనను ఆ పార్టీ ఏజెంట్... ఈ పార్టీ ఏజెంట్ అంటున్నారని.. అందరూ కూర్చొని.. తాను ఏ పార్టీ ఏజెంటో డిసైడ్ అవ్వండి అంటూ అసదుద్దీన్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. 

click me!