ఇండియాలో 24 గంటల్లో 10,549 కోవిడ్ కేసులు: సగం కేసులు కేరళలోనే

By narsimha lode  |  First Published Nov 26, 2021, 10:26 AM IST


ఇండియాలో 10,549 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు  3,45,55,431కి చేరుకొన్నాయి.  కేరళలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. 


ఇండియాలో గత 24 గంటల్లో 10,549 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,45,55,431కి చేరుకొన్నాయి. 488 రోజుల కనిష్ట స్థాయికి కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఒక్క కేరళ రాష్ట్రంలోనే నిన్న 5,987 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో 384 మంది మృత్యువాత పడ్డారు.
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి.

also read:ఆందోళనకరంగా కరోనా కొత్త వేరియంట్... జాగ్రత్త: రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య హెచ్చరిక

Latest Videos

undefined

దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,67468 చేరింది. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.10,133 లక్షలకి చేరిందని icmr తెలిపింది.  నిన్న ఒక్క రోజే కరోనా నుండి 9,868 మంది కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,39,77,830 గా నమోదైంది.కరోనా యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1 శాతంగా ఉన్నాయి.  యాక్టివ్ కేసులు 0.32 శాతంగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2020 మార్చి నుండి ఈ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.  రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 49 రోజులుగా 20 వేలకు దిగువన నమోదయ్యాయి. మరో వైపు 152 రోజులుగా 50 వేల కంటే తక్కువగా కోవిడ్ కేసులు రికార్డు అవుతున్నాయి.  నిన్న ఒక్క రోజే 83,88,824 మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో  120 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.

ఇదిలా ఉంటే  దేశంలో కరోనా కొత్త రూపం సంతరించుకొంది. దక్షిణాఫ్రికాలో ‘బి.1.1.529’రకం కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. ఈ వైరస్ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. అంతేకాదు రోగ నిరోధక శక్తిపై కూడా ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు అనుమానిస్తున్నారు.  ఇప్పటికే ఈ వేరియంట్ వేరియంట్‌ను బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లోనూ కనుగొన్నారు. ఇక్కడి నుండి వ్యాప్తి చెందకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

click me!