Honey moon Murder Case: ఇంట్లో పని చేసే కుర్రాడి కోసం..భర్తనే కాటికి పంపినవా..సినిమాని మించిన ట్విస్టులు!

Published : Jun 10, 2025, 11:01 AM ISTUpdated : Jun 10, 2025, 11:21 AM IST
Indore couple crime news

సారాంశం

హనీమూన్‌లో భర్త హత్యకు భార్యే సూత్రధారి. ప్రేమికుడితో కలిసి షిల్లాంగ్‌లో ప్లాన్‌ చేసి కిరాయి హంతకుల ద్వారా రఘువంశీని చంపించినట్లు పోలీసులు వెల్లడి.

హనీమూన్‌ (Honey Moon) కి వెళ్లిన భర్తను ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసి చంపేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ మర్డర్‌ ని మృతుని భార్య సోనమ్‌ ముందుగానే పక్కా ప్లానింగ్‌ తోనే చేసిందని తెలిసింది.మే 11న మృతుడు రాజా రఘువంశీ, సోనమ్‌ పెళ్లి జరిగింది.ఆ తరువాత వారిద్దరూ మే 20న హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే మే 23న ఇద్దరూ కనిపించకుండాపోయారు. జూన్ 2న చిరపుంజి సమీపంలోని లోయలో రఘువంశీ డెడ్‌ బాడీ కనపడింది.

మొదట్లో సోనమ్‌ను(Sonam) హత్య చేసారా అనే అనుమానాలు వచ్చాయి. కానీ వారం తర్వాత ఆమె యూపీలోని ఘాజీపూర్‌లో కనిపించింది విచారణలో పోలీసులు వారి స్టైల్‌ లో విచారణ చేపట్టగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.సోనమ్ వారి ఇంట్లో పని చేసే రాజ్‌ కుష్వాహాతో ఐదు సంవత్సరాలుగా ప్రేమాయణం,సంబంధం కొనసాగిస్తుంది.

పెళ్లి తరువాత కూడా వారి మధ్య సంబంధం కొనసాగింది. తన ప్రేమికుడికి భర్త అడ్డుగా మారుతాడని భావించి, హనీమూన్ టూర్‌ను హత్య కోసం వేదికగా చేసుకుంది.ప్రేమికుడు రాజ్‌ కుష్వాహా సహా విక్కీ ఠాకూర్‌, ఆనంద్‌ అనే ఇద్దరిని కూడా వారి వెనుక వెళ్లారు. షిల్లాంగ్‌ చేరిన తర్వాత పథకాన్ని పక్కాగా అమలు చేశారు. రఘువంశీని ఓ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి, మృతదేహాన్ని లోయలో పడేసారు. టూర్లో రిటర్న్ టికెట్ బుక్ చేయకపోవడం వల్లే సోనమ్‌పై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో వారు విచారణ మొదలు పెట్టారు.

అనంతరం సోనమ్‌ ఘాజీపూర్ చేరుకుని ఎవరికీ దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించింది. అయితే చివరికి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారించిన తరువాత అసలు నిజాలు ఒప్పుకుంది. మేఘాలయ పోలీసులు ఘాజీపూర్‌కు చేరుకుని కేసు దర్యాప్తును మొదలు పెట్టారు.

ఇక సోనమ్‌ తండ్రి దేవిసింగ్‌ తన కూతురిపై అనవసర ఆరోపణలు మోపుతున్నారంటూ ఆరోపిస్తుండగా, రఘువంశీ తల్లి కన్నీటిపర్యంతమవుతూ, కోడలే తమని నిండా ముంచేసిందని ఆరోపిస్తున్నారు. ఇక రఘువంశీ హనీమూన్‌కి రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ధరించి వెళ్లగా, వాటిని సోనమ్‌ వేసుకోమని అడిగినట్లు చెప్పినట్లు రాజా తల్లి తెలిపారు.సోనమ్‌తో పాటు ఆమె ప్రేమికుడు రాజ్‌ కుష్వాహా సహా ముగ్గురు అరెస్ట్‌ కాగా, కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

అంత్యక్రియల్లో నిందితుడు..

తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్‌ కుశ్యాహా  మృతుడు రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య కేసులో మృతుడి భార్య సోనమ్‌తో సహా మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరైన రాజ్‌ కుశ్యాహాకు, సోనమ్‌కు మధ్య సంబంధం నడుస్తూందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలో రఘువంశీ అంత్యక్రియల్లో కుశ్యాహా కూడా పాల్గొన్న వీడియోను మృతుడి సోదరి ఒకరు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇండోర్‌కు తరలించేందుకు తాము నాలుగు వాహనాలను ఏర్పాటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందులో ఒక దాన్ని నిందితుడు నడిపినట్లు తెలిపారు. సోనమ్‌ తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు చెప్పారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుశ్యాహా రఘువంశీ కుటుంబానికి విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM