
బెంగళూరు : ప్రజలకు న్యాయం చేయాల్సిన Sub-Inspector ఆయన. కానీ, మరో మహిళతో Extramarital affair నెరుపు తుండడంతో భార్యకు తెలిసి అతనిమీదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన
Bangalore గ్రామీణ జిల్లాలోని హోసకోటె తాలూకాలోని సూలిబెలె పీఎస్ లో జరిగింది. రమేష్ గుగ్రీ ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. అంతేకాదు అతనికి భార్య ఉండగా, మరో మహిళతో కూడా కలిసి జీవిస్తున్నాడు. ఈ విషయం ఇటీవలే భార్యకు తెలిసింది. దీంతో ఆమె న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు రమేష్ ను సస్పెండ్ చేశారు.
జూన్ 6న బెంగళూరులో ఇలాంటి కేసే ఒకటి బయటపడింది. తన భార్యను వేధించడంతోపాటు ఆమె మైనర్ కుమార్తెపై Molestationకి పాల్పడ్డాడనే ఆరోపణలతో విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)పై కేసు నమోదైంది. Bengaluruలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ప్రస్తుతం నగరం వెలుపల డిప్యూటేషన్‌లో ఉన్నారు. 2005లో మహిళా పోలీస్ స్టేషన్‌లో తాను ఎస్‌ఐని కలిశానని ఫిర్యాదుదారు తెలిపారు. ఆమె అప్పటి భర్తపై కేసుపెట్టేందుకు వెళ్లగా, అప్పటి భార్య తనపై ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఎస్‌ఐకి సమన్లు అందాయి.
అక్కడ వారి మొదటి సమావేశం తరువాత, ఫిర్యాదుదారు, SI మళ్లీ కలుసుకోవడం కొనసాగించారు. ఆ సమయంలో వారు జీవిత భాగస్వాముల నుండి విడిపోయిన తర్వాత... ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఎస్‌ఐ తనపై శారీరకంగా దాడి చేశాడని, తన 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. తన సోదరిని లైంగికంగా వేధించాడని కూడా ఆమె ఆరోపించింది.
ఇక ఏపీలోని అనంతపురంలోనూ ఇలాంటి దారుణ ఘటనే నిరుడు చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుని పోలీస్ శాఖ పరువు తీసిన కానిస్టేబుల్ హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ ను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సస్పెండ్ చేశారు. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన హర్షవర్ధన్ రాజు(2018వ బ్యాచ్) అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
ఈయనకు కల్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ మహిళతో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కరే సంతానం. దీంతో కట్న కానుకల కింద రూ.20 లక్షల నగదు, పది తులాల బంగారం, కారు ఇచ్చినట్లు సమాచారం. కాగా, హర్షవర్ధన్ రాజుకు కొన్నేళ్ల క్రితం ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమెను తరచూ ఇంటికి తీసుకు వెళ్లేవాడు. ఈ విషయమై భార్య అడిగితే తన చెల్లి అని చెప్పేవాడు.
ఓ రోజు గట్టిగా నిలదీయగా.. ‘Police Departmentలో ఇటువంటివి సహజం. లైట్ గా తీసుకోవాలి’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో విసిగిపోయిన భార్య పుట్టింటకి వెళ్లింది. భార్యను తిరిగి తీసుకురావడానికి ఆయన ఏనాడూ వెళ్లలేదు. చివరకు పెద్దలు పంచాయతీ చేసినా ప్రవర్తన మార్చుకోలేదు.
దీంతో బాదితురాలు, ఆమె తండ్రి బ్రహ్మ సముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో విచారణకు ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారుల నివేదిక ఆధారంగా హర్షవర్ధన్ రాజుతో పాటు మహిళా కానిస్టేబుల్ మీద కూడా Suspension వేటు వేశారు.