
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో పుష్ప ఒకటి. ఈ సినిమాలో హీరో.. ఎర్రచందనం స్మగ్లింగ్ డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాడు. అయితే... ఈ సినిమాలో హీరో స్మగ్లింగ్ చేసిన విధానం.... స్మగ్లర్స్ కి బాగా నచ్చింది. ఇంకేముంది.. ఆ స్టైల్లో వారు కూడా స్మగ్లింగ్ చేయడం మొదలుపెడుతున్నారు. కానీ ఇది సినిమా కాదు కదా.. పోలీసులకు దొరక్కుండా ఉండటానికి.. రియల్ లైఫ్.. అందుకే.. ఇట్టే దొరికేస్తున్నారు. తాజాగా ఆగ్రాలో ఓ స్మగ్లర్ ఇలానే పోలీసుల ముందు బుక్కయ్యాడు.
ఆగ్రా కి చెందిన ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని సికంద్ర పోలీసులు తాజాగా గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు. సదరు క్రిమినల్ పై రూ.15వేల రివార్డు కూడా ఉండటం గమనార్హం.
సదరు నిందితుడు... దాదాపు రూ.2కోట్లు విలువచేసే గంజాయ్ ని తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో... అతనిపై పోలీసులు ఎన్ కౌంటర్ కూడా చేయడం గమానార్హం. నిందితుడి కాలిపై తుపాకీతో కాల్చారు. అనంతరం.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఆగ్రాలో 1500 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.