ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య

Published : Sep 26, 2018, 10:43 AM IST
ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య

సారాంశం

ఈ క్రమంలో ప్రదోష్‌కు మంగుళూరుకు చెందిన కారు డ్రైవర్‌ మహ్మద్‌ యాసిన్ తో  వివాహేతర సంబంధం ఏర్పడింది.  

ప్రియుతో అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. కట్టుకున్న భర్తను ప్రియుడి సహాయంతో దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ర్ణాటక రాష్ట్రానికి చెందిన మహ్మద్‌ సమీర్‌(32) గల్ఫ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ప్రదోష్‌ అనే మహిళలో వివాహం కాగా వీరికి ఆరు నెలల పాప ఉంది. విదేశంలో ఉంటున్న ఇతను ఆరు నెలలకొకసారి భార్యను చూడడానికి ఇక్కడికి వస్తుండేవాడు. ఈ క్రమంలో ప్రదోష్‌కు మంగుళూరుకు చెందిన కారు డ్రైవర్‌ మహ్మద్‌ యాసిన్ తో  వివాహేతర సంబంధం ఏర్పడింది.

దీంతో  అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత నెలలో గల్ఫ్‌ నుంచి వచ్చిన భర్తను కొడైక్కానల్‌ విహార యాత్రకు తీసుకెళ్లిన ప్రదోష్‌.. ప్రియుడు మహ్మద్‌ యాసిన్ సాయంతో గొంతు కోసి హత్య చేసింది. తర్వాత ఈ నెల 17వ తేదీన కుమార్తెతో కలిసి ఆమె మాత్రమే ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులు భర్త గురించి అడగ్గా స్నేహితులతో కలిసి సేలం వెళ్లినట్లు చెప్పింది. 

తర్వాత ఇంట్లోని 60 సవర్ల బంగారు నగలు తీసుకొని కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.  ప్రియుడితో కలిసి భర్తను ప్రదోషే హత్య చేసిందని, కేసు నమోదుచేసి ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi Speech: బెంగాల్ లో బీజేపీ గెలుపుపై మోదీ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
CM Convoy Reaches Vijay’s House: విజయ్ కోసం సీఎం క్యాన్వాయ్ సిద్ధం | Asianet News Telugu