యువకుడితో స్నేహం...ముక్కలు ముక్కలుగా నరికిన లవర్

sivanagaprasad kodati |  
Published : Sep 26, 2018, 10:07 AM IST
యువకుడితో స్నేహం...ముక్కలు ముక్కలుగా నరికిన లవర్

సారాంశం

తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉండాన్ని చూసి ఓర్చుకోలేకపోయాడు. ఆమెపై కక్ష పెంచుకొని యువతిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు.

తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉండాన్ని చూసి ఓర్చుకోలేకపోయాడు. ఆమెపై కక్ష పెంచుకొని యువతిని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నిజాంనగర్ ప్రాంత వాసి రిజ్వాన్‌ఖాన్ (20) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత 11 నెలలుగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేయసి మరో యువకుడితో స్నేహంగా ఉంటుందని తెలిసిన రిజ్వాన్ ఖాన్ ప్రేయసితో గొడవపడ్డాడు. అనంతరం కత్తి తీసుకొని ప్రియురాలి మెడ కోసి రెండు ముక్కలు చేశాడు. 

ప్రేయసి శవాన్ని రెండు బ్యాగుల్లో ప్యాక్ చేసి వాటిని బారాపుల్లా ఫ్లై ఓవర్ కింద ఉన్న లాలాలజపతిరాయ్ మార్గ్ మురుగుకాల్వలో పడేశాడు. అనంతరం రిజ్వాన్ నేరుగా పోలీసుస్టేషనుకు వెళ్లి తాను తన ప్రేయసిని హత్య చేశానని పోలీసుల ముందు లొంగిపోయాడు. నిరుద్యోగి అయిన రిజ్వాన్ తల్లీ, సోదరులతో కలిసి ఉంటున్నాడని పోలీసులు చెప్పారు. పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ