ప్రేమించడానికి ముస్లిం అబ్బాయే దొరికాడా.. యువతిని చితకబాదిన పోలీసులు

sivanagaprasad kodati |  
Published : Sep 26, 2018, 08:41 AM IST
ప్రేమించడానికి ముస్లిం అబ్బాయే దొరికాడా.. యువతిని చితకబాదిన పోలీసులు

సారాంశం

మరో మతం అబ్బాయిని ప్రేమించిన యువతి పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మీరట్‌కు చెందిన ఓ హిందూ యువతి తన స్నేహితుడైన ముస్లిం యువకుడికి ఇంటికి వెళ్లింది.

మరో మతం అబ్బాయిని ప్రేమించిన యువతి పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మీరట్‌కు చెందిన ఓ హిందూ యువతి తన స్నేహితుడైన ముస్లిం యువకుడికి ఇంటికి వెళ్లింది.

మెడికల్ విద్యార్థులైన వారిద్దరూ కలిసి చదువుకుంటుండగా అక్కడికి ఒక్కసారిగా చేరుకున్న విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వారిద్దరిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. ఇది లవ్‌జిహాదే అంటూ ఆరోపించారు. వారిద్దరిపై వీహెచ్‌పీ కార్యకర్తలు దాడి చేస్తారేమోనని భయపడిన పోలీసులు ఇద్దరిని వ్యాన్‌‌లో ఎక్కించుకుని తీసుకెళ్ళారు.

వ్యాన్  ఎక్కిన తర్వాత.. ఆ యువతి ఓ మహిళా కానిస్టేబుల్ పక్కన కూర్చుంది..మరో ముగ్గురు పోలీసులు కూడా వ్యానులో ఉన్నారు... సరిగ్గా ఈ సమయంలో ‘‘ సమాజంలో చాలా మంది హిందువులుండగా ముస్లిం యువకుడితోనే ఎందుకు సన్నిహితంగా ఉంటున్నావు.. ప్రేమించడానికి నీకు హిందూ అబ్బాయే దొరకలేదా అంటూ’’ మహిళా కానిస్టేబుల్ కొడుతూ వేధించింది.

ఈ తతంగాన్ని పోలీసులు వీడియో తీశారు. అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు గానీ... సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం ఉన్నతాధికారుల దాకా వెళ్లడంతో నలుగురు పోలీసులను సస్పెండ్ చేసి... దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ విషయంపై ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ‘‘ పోలీసులు తమ బాధ్యతలను మరచి ప్రవర్తించారు.. అందుకే వారిని సస్పెండ్ చేశాము.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాం.. మాకు నివేదిక వచ్చిన తర్వాత తదుపురి చర్యలు తీసుకుంటాం అని తెలిపాడు.
 

PREV
click me!

Recommended Stories

వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu
Business Ideas : కేవలం రూ.10 వేలు చాలు.. మీ సొంతింట్లోనే ఈ వ్యాపారాలు చేయండి, మంచి ఇన్కమ్ పొందండి