అన్నంలో చీమలు వచ్చాయని దంపతుల మధ్య గొడవ.. భర్తను స్కార్ఫ్‌తో ఉరేసి చంపిన భార్య

Published : Nov 25, 2022, 03:49 PM IST
అన్నంలో చీమలు వచ్చాయని దంపతుల మధ్య గొడవ.. భర్తను స్కార్ఫ్‌తో ఉరేసి చంపిన భార్య

సారాంశం

ఒడిశాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాత్రిపూట భోజనం చేస్తుండగా భార్య వడ్డించిన అన్నంలో చీమలు కనిపించగా భర్త ఆగ్రహించాడు. గొడవ తీవ్రం కావడంతో భార్య స్కార్ఫ్‌తో భర్తను ఉరేసి చంపేసింది.  

న్యూఢిల్లీ: రాత్రిపూట భోజనం చేస్తూ ఉండగా అన్నంలో చీమలు కనిపించాయి.దీనితో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. భార్యపై భర్త తీవ్రంగా ఆగ్రహించాడు. ఈ ఆగ్రహంతోనే భర్య.. భర్తను అంతమొందించింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కెలాలో చోటుచేసుకుంది.

ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. శశి భూషణ్ బాగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, 35 ఏళ్ల తన కొడుకు హేమంత బాగ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సరిత. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఏడేళ్ల హేమలత, నాలుగేళ్ల సౌమ్యలు ఉన్నారు. వీరంతా కలిసే ఉంటున్నారు. 

Also Read: మూడు పెళ్లిళ్లు.. బీమా డబ్బు కోసం.. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోమంటూ భర్త వేధింపులు..

ఆ రోజు రాత్రి భోజనం చేస్తుండగా దంపతుల మధ్య గొడవ జరిగింది. హేమంత బాగ్‌కు భార్య సరిత అన్నం వడ్డించింది. ఆ ఆహారంలో చీమలు కనిపించాయి. అన్నంలో చీమలు ఎలా వచ్చాయని అడిగాడు. దీనికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. హేమంత బాగ్ భార్య సరితపై సీరియస్ అయ్యాడు. ఇదే గొడవ తీవ్రరూపం దాల్చింది. సరిత కూడా తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అదే ఆవేశంతో స్కార్ఫ్‌తో భర్తకు ఉరేసింది. భర్త హేమంత బాగ్ చనిపోయాడు.

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM