15 ఏళ్ల నాటి ప్రభుత్వ వాహనాలు రద్దు చేస్తాం - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

By team teluguFirst Published Nov 25, 2022, 3:44 PM IST
Highlights

15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను రద్దు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆ వాహనాలను స్క్రాప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. 

15 ఏళ్ల నాటి ప్రభుత్వ వాహనాలను రద్దు చేస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ  అన్నారు. దీనికి సంబంధించిన విధానాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించినట్టు ఆయన తెలిపారు. రోడ్లపై తిరిగే 15 ఏళ్ల నాటి వాహనాలను స్క్రాప్  చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పామని చెప్పారు. 

'భారతదేశ చరిత్ర అంటే కేవలం బాబర్, జహంగీర్ కథలు కాదు...'

కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది ప్రారంభంలో వాహనాల స్క్రాపేజ్ విధానాన్ని ప్రకటించింది. ఇందులో బస్సులు, ట్రక్కులు, కార్లతో పాటు అన్ని రకాల వాహనాలు ఉన్నాయి. కొత్త స్క్రాపేజ్ విధానం ప్రకారం ఇలా సమయం దాటిన  అన్ని పాత వాహనాలను వీధుల్లోంచి బయటకు తీస్తారు. నివేదికల ప్రకారం.. వాహనాల స్క్రాపేజ్ విధానంలో పాత, ఫిట్‌నెస్ లేని వాహనాలను తొలగించి వాటి స్థానంలో ఆధునిక, కొత్త వాహనాలను రోడ్లపై ఉంచాల్సి ఉంటుంది. ఈ విధానం ఏప్రిల్ 1, 2022 నుండి అమలులోకి వచ్చింది.

కాగా.. కొత్త స్క్రాపేజ్ విధానం ప్రకటించకముందే దేశ రాజధానిలో 15 ఏళ్ల పెట్రోల్, 10 ఏళ్ల డీజిల్ వాహనాలను నడపడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ 2014లో ఉత్తర్వులు జారీ చేస్తూ 15 ఏళ్లు పైబడిన వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయకూడదని నిషేధం విధించింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన గే దంపతులు.. తమ పెళ్లిని చట్టబద్ధంగా గుర్తించాలని విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 2-3 వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను కలిగి ఉండాలనే తన ప్రణాళికను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఏడాది మేలో ప్రకటించారు. హర్యానాలో కొత్త రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌వీఎస్‌ఎఫ్) ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన దీనిని వెల్లడించారు. దేశంలోని రోడ్ల నిర్మాణంలో పాత టైర్లు వంటి ముడిసరుకులను ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆఫ్తాబ్ పాలిగ్రాఫ్ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు.. నేడూ కొనసాగనున్న టెస్టులు..

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 2021లో వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్ అని పేర్కొనే ఆటోమోటివ్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించారు. ఈ విధానం సుమారు రూ. 10,000 కోట్ల పెట్టుబడిని తీసుకువస్తుందని చెప్పారు. ఈ పాలసీ ప్రకారం.. తమ సొంత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేసే యజమానులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. అలాతే కొత్త కారుపై రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కూడా ఇస్తుంది. 
 

click me!