'భారతదేశ చరిత్ర అంటే కేవలం బాబర్, జహంగీర్ కథలు కాదు...'

By Rajesh KarampooriFirst Published Nov 25, 2022, 3:27 PM IST
Highlights

భారతదేశ చరిత్ర  అంటే.. కేవలం ఔరంగజేబు, బాబర్, జహంగీర్ లేదా హుమాయున్‌ల కథలు కాదనీ, మన దేశంలో లచిత్ బర్ఫుకాన్, ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్, దుర్గాదాస్ రాథోడ్ వంటి పోరాట యోధులు కూడా ఉన్నారని, వారి గురించి చరిత్రలో పొందుపరచాలని చరిత్రకారులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ  వినయపూర్వకమైన అభ్యర్థించారు.

భారతదేశ చరిత్ర అంటే..  కేవలం ఔరంగజేబ్, బాబర్, జహంగీర్ లేదా హుమాయూన్‌ల కథలు కాదని, మొఘల్ చక్రవర్తులను ప్రతిఘటించిన యోధుల కథలు, వారి ధైర్యసాహసాలు కూడా అందులో భాగమేనని ఈ విషయాన్నిచరిత్రకారులకు గుర్తించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.  

అస్సాం పోరాట యోధుడు  లచిత్ బర్ఫుకాన్ 400వ జయంతి వేడుకల్లో శుక్రవారం నాడు  సీఎం బిస్వాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లచిత్ బర్ఫుకాన్  ధైర్యాన్ని ప్రశంసించారు.భారతదేశం అంటే కేవలం ఔరంగజేబు, బాబర్, జహంగీర్ లేదా హుమాయూన్‌ల కథలు కాదని చరిత్రకారులకు గుర్తు చేశారు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును అస్సాంలో ప్రతిఘటించగలిగింది లచిత్ బర్ఫుకాన్ అని.. అతని ధైర్యసాహసాలను శర్మ కీర్తించారు. “చరిత్రకారులకు నా వినయపూర్వకమైన విన్నపం - భారతదేశం కేవలం ఔరంగజేబు, బాబర్, జహంగీర్ లేదా హుమాయున్‌ల కథ కాదు. భారతదేశంలో లచిత్ బర్ఫుకాన్, ఛత్రపతి శివాజీ, గురుగోవింద్ సింగ్, దుర్గాదాస్ రాథోడ్‌ వంటి యోధులు కూడా ఉన్నారు.కొత్త కోణంలో చరిత్రను చూసేందుకు ప్రయత్నించాలని సూచించారు. 

చరిత్రలో ప్రస్తావించని యోధులను వెలుగులోకి తీసుకురావాలని,  భారత్ విశ్వ గురువు కావాలనే మా కలను నెరవేరుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అంటారని తెలిపారు. “లచిత్ బర్ఫుకాన్ యొక్క అద్భుతమైన గాథను దేశం ముందు తీసుకురావడానికి ఇది మా వినయపూర్వకమైన ప్రయత్నం. అయితే ప్రభుత్వం చేస్తున్న కృషి ఒక్కటే సరిపోదు. ప్రజలు, చరిత్రకారులు కూడా కృషి చేయాలి’’ అని అన్నారు.

ఈశాన్య ప్రాంతంలో సుస్థిర అభివృద్ధి, శాంతిని తీసుకువచ్చినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా  ప్రయత్నిస్తు్న్నారని సీఎం ప్రశంసించారు. భారత చరిత్రను వక్రీకరించారని, తప్పుగా రాశారని ఆరోపించారు. చరిత్రకారులు, పరిశోధకులను చరిత్రను తిరగరాయాలని విజ్ఞప్తి చేశారు. మన చరిత్రను వక్రీకరించడం, తప్పుగా వ్రాయడం గురించి తరుచు విన్నాననీ, ఇది నిజం కావచ్చుననీ, ఇప్పుడు మన అద్భుతమైన చరిత్ర గురించి వ్రాయకుండా ఎవరు ఆపగలరు? మనకు ధైర్యం ఉండాలి. మన చరిత్రను తిరగరాసి బహిరంగం చేయాలని అన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా  భారతదేశ చరిత్రను వక్రీకరించి, తప్పుగా రాశారని, వాస్తవ చరిత్రను బయట ప్రపంచానికి తెలియజేయాలని చరిత్రకారులు, పరిశోధకులకు షా విజ్ఞప్తి చేశారు.
 
లచిత్ బర్ఫుకాన్ ఎవరు? 

బర్ఫుకాన్ (నవంబర్ 24, 1622 - ఏప్రిల్ 25, 1672) అస్సాం లోని అహోం రాజ్య సామ్రాజ్య సైన్యాధిపతి. అతడు మొఘల్‌ల దండ యాత్రను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.ఔరంగజేబుకు వ్యతిరేకంగా జరిగిన సరైఘాట్ యుద్ధంలో బర్ఫుకాన్ అస్సామీ దళాలకు నాయకత్వం వహించాడు. ఈ యుద్దంలో మొఘలయుల సైన్యానికి చుక్కలు చూపించారు.  వీరోచితంగా పోరాడి ఓటమి పాలయ్యాడు. కానీ..  బర్ఫుకాన్, అతని సైన్యం మొక్క  వీరోచిత పోరాటం నేటీకి స్ఫూర్తిదాయకమే.  

click me!