
ఉత్తర ప్రదేశ్ : పోలీసు ఉద్యోగాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వేళాపాళా లేకుండా.. సెలవులు, పండగలు లేకుండా.. 24 గంటలు ప్రజారక్షణలోనే మునిగి పోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి దాదాపుగా దూరం ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇన్స్పెక్టర్ భార్య అలిగిందట. పెళ్లయిన 22 ఏళ్లపాటు భార్యను హోలీకి పుట్టింటికి తీసుకెళ్లకపోవడంతో భర్త మీద తీవ్రంగా అలిగిందట. దీంతో భార్య అలక తీర్చడానికి తనకు ఒక నెల రోజుల సెలవు కావాలంటూ పోలీసు అధికారి తనపై అధికారికి లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో చూసింది. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ మేరకు ఎస్పీకి లెటర్ రాశారు. గత 22 ఏళ్లుగా తన భార్యను హోలీ పండుగకు ఆమె పుట్టింటికి తీసుకు వెళ్లలేదని.. దీంతో ఆమె అలిగిందని.. ఆమెను శాంతింప చేయాలంటే, తన సంసారాన్ని కాపాడుకోవాలంటే తనకు పదిరోజుల సెలవు కావాలని పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ లెటర్లో పేర్కొన్నాడు. పోలీసు ఉద్యోగంలో సెలవులు దొరకక పోవడం వల్ల పెళ్లయిన 22 ఏళ్ల నుంచి హోలీ పండుగకు తన భార్యను పుట్టింటికి తీసుకు వెళ్లలేకపోయానని.. ఆవేదన వ్యక్తం చేస్తూ ఉత్తరం రాశారు.
షాకింగ్... యూ ట్యూబ్ లో చూస్తూ ప్రసవం చేసుకుని, నవజాతశిశువు గొంతు నులిమి చంపిన 15 యేళ్ల బాలిక.. !!
‘ఈసారి హోలీకి నాతో కలిసి నా భార్య తన పుట్టింటికి వెళ్లాలని అనుకుంటుంది. ఇది కూడా తీర్చకపోతే తను కచ్చితంగా ఇక నాతో మాట్లాడదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు కావాలి. నా ఈ సమస్యను పరిగణలోకి తీసుకొని ఓ పదిరోజుల పాటు సెలవు ఇవ్వాలని కోరుతున్నాను’ అని లెటర్ రాయడం.. అది చూసి గట్టిగా నవ్వినట్లు పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా చేస్తే మరి ఆ ఇన్స్పెక్టర్ కి సెలవులు దొరికాయా అంటే.. పది రోజులు కాదు కానీ ఐదు రోజులు సెలవులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.