ఫంక్షన్ కి వెళ్లి, ఆలస్యంగా వచ్చాడని.. భర్త మీద అలిగి భార్య ఆత్మహత్య..

By SumaBala BukkaFirst Published Jan 24, 2023, 10:14 AM IST
Highlights

భర్త ఇంటికి ఆలస్యంగా రావడం తట్టుకోలేని ఓ భార్య అలిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలో వెలుగు చూసింది. 

బెంగళూరు : చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకోవడం నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తమకు ఇష్టం లేని చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేనంత మానసిక దౌర్భాల్యానికి గురవుతున్నారు.  దీంతో.. తల్లి టీవీ చూడనివ్వలేదని, వీడియో గేమ్ ఆడుకోనివ్వలేదని.. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని,  భార్య తనకు నచ్చిన కూర వండలేదని.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి ఓ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

భర్త ఇంటికి ఆలస్యంగా వచ్చాడని.. గొడవ పడిన భార్య  అతని మీద అలిగి ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో  చోటుచేసుకుంది. మృతురాలు దివ్యగా గుర్తించారు. ఆమె దక్షిణ కన్నడ జిల్లా సూరత్కల్ లోని బాళ గ్రామం ఒట్టెకాయకు చెందిన హరీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కాపురం చక్కగా సాగుతున్న క్రమంలో... ఓ గొడవ వీరి కాపురంలో చిచ్చు పెట్టింది. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 

 గొడవకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం హరీష్, దివ్యల  పక్కింట్లో  ఓ శుభకార్యం జరిగింది. దీనికి హరీష్ ఒక్కడే వెళ్ళాడు. అలా వెళ్లిన వాడు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో దివ్య  విపరీతమైన కోపానికి వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూరత్కల్ లోని ఓ మందుల షాపులో దివ్య పని చేస్తుంది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ‘తీవ్రవాది’గా పేర్కొన్న గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే..

అయితే, ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేస్తున్నారని.. కూతురు ఇలా చేయడానికి అవకాశం లేదని ఆమె తల్లి గిరిజా పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని..  భర్త హరీష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు జూన్ లో చెన్నైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానిక మాధవరంలో ఎక్కువసేపు TV చూస్తూందని తల్లి మందలించడంతో ఏడో తరగతి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం తెలుగు కాలనీకి చెందిన నాగరాజు చెన్నై కార్పొరేషన్ మాధవరం మండలంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఏంజెల్ (12) మాధవరం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఏంజల్ ఇంట్లో ఎక్కువ సమయం టీవీ చూస్తూ ఉండటంతో, తల్లి కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఏంజెల్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

click me!