విచిత్రం... వరుడు రూ.10 నోట్లను లెక్కించలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు...

By SumaBala BukkaFirst Published Jan 24, 2023, 6:49 AM IST
Highlights

వరుడు 10 రూపాయల కరెన్సీ నోట్లను లెక్కించలేకపోయాడని రీటా సింగ్ అనే వధువు వివాహ వేడుకను రద్దు చేసుకుంది.  ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగింది. 

ఉత్తరప్రదేశ్ : కాబోయే జీవితభాగస్వామి గురించి అనేక కలలు కంటారు అమ్మాయిలు. వరుడు రాజకుమారుడిలా ఉండాలని.. తనను మహారాణిలా చూసుకోవాలని.. అందంగా ఉండాలని, బాగా సంపాదించాలని, తెలివైనవాడై ఉండాలని.. బలశాలై ఉండాలని.. తననూ తనతో సమానంగా గౌరవించాలని.. ఇలా అనేకరకాల ఇష్టాలు, కోరికలు ఉంటాయి. అయితే, అనుకున్నవన్నీ ఉన్న వ్యక్తి దొరకడం అసాధ్యం. అందుకే కాస్త అటూ, ఇటూగా అయినా సరే.. కొన్నింటికి కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటుంటారు. అయితే, తాము అనుకున్నవి సరిగా లేవని కొన్నిసార్లు పెళ్లి పీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకునే అమ్మాయిల ఘటనలు ఇటీవల కనిపిస్తున్నాయి. అలాంటి ఓ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. 

వరుడికి పదిరూపాయల నోట్లు లెక్కించడం రాదని ఉన్నఫలానా పెళ్లి క్యాన్సిల్ చేసుకుందో అమ్మాయి.ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన రీటా సింగ్ అనే వధువు, వరుడు 10 రూపాయల కరెన్సీ నోట్లను లెక్కించడంలో విఫలమైనందున తన పెళ్లిని రద్దు చేసుకుంది. పెళ్లి వేడుకను నిర్వహిస్తున్న పూజారి వరుడి ప్రవర్తన గురించి అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఈ సంఘటన జరిగింది.

ఇదెక్కడి ఛోద్యం.. మాల వేసేటప్పుడు వరుడు ముద్దు పెట్టుకున్నాడని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు...!!

పూజారి చెప్పిన విషయం విని కుటుంబం ఆశ్చర్యపోయింది. కానీ పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిని ఎలా క్యాన్సిల్ చేయడం? అలాగే పూజారి చెప్పింది నిజం అని నిరూపించడం ఎలా? అందుకే పెళ్లి కొడుకు వింత ప్రవర్తన గురించి విన్న వెంటనే, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అతనికి 10 రూపాయల 30 నోట్లను ఇచ్చి వాటిని లెక్కించమని కోరారు. అయితే ఆ చిన్న లెక్క చేయడానికి వరుడు కిందామీదా పడ్డాడు. చాలా ప్రయాసపడ్డాడు. అది వధువు ముందు తనను తాను నిరూపించుకునే చివరి అవకాశం.. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో 21 ఏళ్ల యువకుడు పెళ్లి వేడుక నుండి బయటకు వెళ్లి, పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇదిలా ఉండగా, వరుడు మానసికంగా బలహీనుడని తమకు తెలియదని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. "సాధారణంగా వివాహాలు నమ్మకంతో జరుగుతాయి. మధ్యవర్తి మాకు దగ్గరి బంధువు కాబట్టి మేం అతనిని నమ్మాం. అందుకే పెళ్లికి ముందు వరుడిని కలవలేదు. ఆ తరువాత పూజారి అతని విచిత్ర ప్రవర్తన గురించి మాకు చెప్పినప్పుడు, అతడిని పరీక్షించాలనుకున్నాం. అతనికి రూ. రూ.10... ల30 కరెన్సీ నోట్లను ఇచ్చాం. ఆ 10 రూపాయల నోట్లను  లెక్కించలేకపోయాడు. అది చూసి షాక్ అయ్యాం. అతని పరిస్థితి గురించి తెలిసిన తర్వాత, రీటా అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది" అని వధువు సోదరుడు మోహిత్ చెప్పాడు. 

యువకుడితో పెళ్లికి వధువు నిరాకరించడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినప్పటికీ, వధువు తన పట్టు వదలలేదు, మొండిగా ఉంది. చివరికి, వరుడు భరత్ పెళ్లి కాకుండానే వెనుతిరిగి రావాల్సి వచ్చింది.

click me!