ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు పిసికి చంపిన భార్య

By narsimha lode  |  First Published Feb 25, 2020, 7:50 AM IST

ప్రియుడితో వివాహేతర సంబంధంతో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది  ఓ భార్య. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో చోటు చేసుకొంది.ఆర్మీలో పనిచేస్తున్న దీపక్ ను భార్య అంజలి ప్రియుడు ప్రశాంత్ తో కలిసి హత్య చేసింది.



బెంగుళూరు: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలో జరిగింది. తన ఇంట్లో పనిచేసే కారు డ్రైవర్ తో వివాహేతర సంబంధం కలిగి ఉన్న వివాహిత పథకం ప్రకారం భర్తను హత్య చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం తేలింది.

Also read:కామారెడ్డిలో దారుణం: భార్యను కొట్టి వివస్త్రను చేసి గెంటేసిన భర్త

Latest Videos

undefined

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి తాలుకాల మారిహలకు చెందిన  32 ఏళ్ల దీపక్ పట్టణదార్ సైన్యంలో పనిచేస్తున్నాడు.14 ఏళ్లుగా ఆయన సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయనకు అంజలితో వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది.

ఆరు మాసాలకు ఓసారి ఆయన స్వంత గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. వారం రోజుల పాటు భార్యా పిల్లలతో గడిపి తిరిగి విధుల్లో చేరేందుకు వెళ్లేవాడు.తన భార్యకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో హూన్నిహళ గ్రామంలో ఓ ఇల్లు కూడ కట్టించాడు. అంతేకాదు ఆమె ఎక్కడికైనా వెళ్లేందుకు కూడ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. కారుకు ప్రశాంత్ అనే యువకుడిని డ్రైవర్ గా పెట్టాడు.

డ్రైవర్ తో అంజలికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంటి వద్ద లేకపోవడంతో వారికి అడ్డు లేకుండాపోయింది. ఈ ఏడాది జనవరి మూడో వారంలో దీపక్ సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. 

ఆర్మీలో రిటైర్మెంట్ తీసుకొని కర్ణాటక పోలీసు శాఖలో చేరాలని దీపక్ నిర్ణయం తీసుకొన్నాడు. దీపక్ ఇంటి వద్దే ఉంటే ప్రియుడితో తాను సంబంధాన్ని కొనసాగించే పరిస్థితి ఉండదని అంజలి భావించింది. భర్తను హత్య చేస్తే తమకు ఇబ్బంది ఉండదని భావించింది.ఈ మేరకు ప్రియుడితో కలిసి భర్త దీపక్ ను హత్య చేయాలని అంజలి నిర్ణయం తీసుకొంది.

ఈ ఏడాది జనవరి 28వ తేదీన గోకాక్ గోడచనమల్లి జలపాతానికి దీపక్ ను తీసుకెళ్లింది అంజలి. అంజలి భర్తతో బలవంతంగా మద్యం తాగించింది. మద్యం మత్తులో  ఉన్న ప్రశాంత్ ను అంజలి గొంతు పిసికి చంపేసింది. 

అప్పటికే డ్రైవర్ ప్రశాంత్ స్నేహితులు నవీన్, ప్రవీణ్ లు కూడ అక్కడికి  చేరుకొన్నారు. కారులో ఉన్న ప్రశాంత్ శవాన్ని జలపాతంలో తోసేశారు. తన భర్త కన్పించడం లేదంటూ అంజలి ఈ  నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన భర్త ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కూడ చేసింది.

దీపక్ కన్పించకుండా పోయిన రోజున అంజలి, దీపక్ ప్రశాంత్ సెల్ ఫోన్ లోకేషన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో ఈ ముగ్గురి ఫోన్లు ఒకే సెల్ టవర్ పరిధిలో ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రశాంత్ ను అంజలిని ప్రశ్నించారు. దీంతో వీరు అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు. 
ఇదే ప్రాంతంలో దీపక్ మృతదేహం కుళ్లినస్థితిలో లభ్యమైంది. ప్రశాంత్ స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

click me!