రెడ్ డ్రెస్‌తో తళుక్కుమన్న ఇవాంకా: ఇది రెండోసారి, కాస్ట్ ఎంతో తెలుసా..?

Siva Kodati |  
Published : Feb 24, 2020, 09:12 PM IST
రెడ్ డ్రెస్‌తో తళుక్కుమన్న ఇవాంకా: ఇది రెండోసారి, కాస్ట్ ఎంతో తెలుసా..?

సారాంశం

ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ధరించిన డ్రస్ ఇవాళ ఇండియన్ మీడియా కళ్లు పడ్డాయి. దీంతో ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు ఎంత..? ఎవరు డిజైన్ చేశారు..? లాంటి చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. 

రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా భారతదేశానికి విచ్చేశారు. అగ్రరాజ్యాధినేత కుటుంబం వస్తుందంటే అందరి కళ్లు వారి కట్టుబొట్టు గురించే మాట్లాడుకుంటారు.

Also Read:ట్రంప్‌ కుడి ఎడమలు: అగ్రదేశాధినేతను నడిపిస్తున్న కూతురు, అల్లుడు

ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ధరించిన డ్రస్ ఇవాళ ఇండియన్ మీడియా కళ్లు పడ్డాయి. దీంతో ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు ఎంత..? ఎవరు డిజైన్ చేశారు..? లాంటి చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇవాంకా ఈ డ్రెస్‌ను ఎక్కడో వేసుకున్నట్లుగా ఉన్నారే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ వన్‌లో దిగిన ఇవాంకా ట్రంప్.. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడీ డ్రెస్‌ను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ఆరడుగులు ఉండే ఇవాంకా పొడవైన ఎర్రటి హై హీల్స్ ధరించడంతో మరింత ఎత్తుగా కనిపించారు.

Also Read:ట్రంప్ తాజ్ పర్యటన: ఆ ప్రేమ చిహ్నం గురించి వివరిస్తున్న ఆ గైడ్ ఎంపిక ఎలా జరిగిందంటే...

ఇక ఈ డ్రెస్ ఖరీదు విషయానికి వస్తే భారత కరెన్సీలో రూ.1.7 లక్షలే. ఇకపోతే ఇవాంకా ఈ డ్రెస్‌ను ఎక్కడో వేసుకున్నట్లుగా తోస్తుందనేగా మీ డౌట్. అవును 2019లో అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన ఆమె చివరిసారిగా ఇదే డ్రస్సును ధరించారు. సోమవారం భారత పర్యటనలో సందడి చేసిన ఇవాంకా.. ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించి భర్తతో కలిసి ఫోటోలు దిగారు.

PREV
click me!

Recommended Stories

Jallikattu : రక్తచరిత్ర కాదు.. ఇది రక్తం మరిగే ఆట.. జల్లికట్టు గురించి తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ !
Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu