నమస్తే ట్రంప్ పై ఇవాంకా వన్ వర్డ్ రియాక్షన్ ఇదే... (వీడియో)

Published : Feb 24, 2020, 09:37 PM IST
నమస్తే ట్రంప్ పై ఇవాంకా వన్ వర్డ్ రియాక్షన్ ఇదే... (వీడియో)

సారాంశం

అహ్మదాబాదులోని మొతేరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంపై డోనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ఒకే ఒక పదంతో తన అబిప్రాయాన్ని వెల్లడించారు. నమస్తే ట్రంప్ బ్రహ్మాండమని ఇవాంక ట్రంప్ అన్నారు.

అహ్మదాబాద్: అహ్మదాబాద్ లోని మొతెరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ ప్రతిస్పందించారు. ఒకే ఒక్క పదంతో తన స్పందనను ఆమె వినిపించారు. 

కార్యక్రమం ఆనందం కలిగించిందా అని ఏఎన్ఐ ప్రతినిధి అడిగితే బ్రహ్మాండం అని చెప్పారు. ఆ ఒక్క మాటతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ప్రసంగించారు. 

 

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, ఇవాంకా ట్రంప్, ఆయన అల్లుడు జరేద్ కుష్నర్ లకు మొతేరా స్టేడియంలో ఘన స్వాగతం లభించింది. అమెరికాలో హౌడీ మోడీ కార్యక్రమం తరహాలో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నమస్తే అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  

ఆగ్రాలోని సందర్శనతో ట్రంప్ దంపతులు తొలి రోజు పర్యటనకు విరామం ఇచ్చారు. రెండో రోజు రేపు కార్యక్రమాల్లో పాల్గొన్ని రాత్రి అమెరికా బయలుదేరి వెళ్తారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?