
బెంగళూరు: కర్ణాటకలో ఓ అవాంఛనీయ ఘటన జరిగింది. మూఢ నమ్మకాలతో ఓ భార్య పోలీసు స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. క్షుద్ర పూజలను విశ్వసించి హైడ్రామాకు కారణమైంది. భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని, క్షుద్ర పూజలు చేయిస్తే తనను బాగా చూసుకుంటాడని, మాట్లాడతాడని ఆమె నమ్మింది. భర్త పైనే క్షుద్ర పూజలు చేయించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
మైసూరు నాచనహళ్లి పాల్యలో ఈ ఘటన జరిగింది. నాచనహళళ్లి పాల్యలో రఫీ, సమ్రీన్ అనే దంపతులు నివాసముంటున్నారు. భర్త రఫీ తనతో సరిగా మాట్లాడటం లేదని భార్య సమ్రీన్ భావించింది. భర్త పైనే క్షుద్ర పూజలు చేయించడానికి సిద్ధమైంది.
Also Read: ఫుల్‌గా తాగి ఫ్లైట్‌లో వీరంగం.. తోటి ప్రయాణికులు, సిబ్బందితో గొడవ.. బాటిళ్లు లాక్కున్న క్రూ
ఇందులో భాగంగానే ప్రతి అమావాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు, ఇతర వస్తువులను వేరే వ్యక్తులతో వేయిస్తుండేది. మంగళవారం రాత్రి సమ్రీన్ ఆ వస్తువులను ఇంటి ముందు వేస్తుండగా బంధువుల, స్థానికులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం, విద్యారణ్యపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.