‘అమ్మాయిలు ఇలా ఉంటే.. లైంగిక వేధింపులను నివారించవచ్చు’.. జేఎన్ యూ వివాదాస్పద సలహా.. తప్పుపట్టిన మహిళా కమిషన్

By SumaBala BukkaFirst Published Dec 29, 2021, 6:35 AM IST
Highlights

ఇందులో ఒక చోట ‘అబ్బాయిలు కొన్నిసార్లు అనుకోకుండా,  కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా..  స్నేహ పూర్వక  పరిహాసానికి, లైంగిక వేధింపులకు  మధ్య ఉన్న సన్నని  గీతను దాటుతారు.  ఇలాంటి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు గాను అమ్మాయిలు.. వారికి,  వారి మధ్య స్నేహితుల మధ్య ఒక స్పష్టమైన గీతలు ఎలా గీయాలో తెలుసుకోవాలి’  అని ఉంది.

ఢిల్లీ : అమ్మాయిలు లైంగిక వేధింపులను ఎలా నివారించవచ్చో సలహా ఇస్తూ.. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU) అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC) జారీ చేసిన ఓ సర్కిల్ వివాదాస్పదం అయ్యింది.  Sexual harassment పై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు జనవరిలో నిర్వహించే కౌన్సెలింగ్ కు సంబంధించిన ఈ సర్క్యులర్లు తన వెబ్సైట్లో ఉంచింది. 

ఇందులో ఒక చోట ‘అబ్బాయిలు కొన్నిసార్లు అనుకోకుండా,  కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా..  స్నేహ పూర్వక  పరిహాసానికి, లైంగిక వేధింపులకు  మధ్య ఉన్న సన్నని  గీతను దాటుతారు.  ఇలాంటి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు గాను అమ్మాయిలు.. వారికి,  వారి మధ్య స్నేహితుల మధ్య ఒక స్పష్టమైన గీతలు ఎలా గీయాలో తెలుసుకోవాలి’  అని ఉంది.

‘ అన్ని సలహాలు అమ్మాయిలకే ఎందుకు?’
 సర్క్యులర్ లోని ఈ సలహా కాస్త వివాదాస్పదం కావడంతో స్థానిక విద్యార్థి సంఘాలు దీనిపై నిరసన తెలిపాయి.  Chairperson of the National Commission for Women రేఖ శర్మ సైతం దీన్ని తప్పుబట్టారు.  స్త్రీ  ద్వేషపూరిత సర్క్యులర్ గా పేర్కొంటూ…  వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ట్వీట్ చేశారు. ‘ అన్ని సలహాలు ఎప్పుడు అమ్మాయిలకు ఎందుకు?  వేధింపులకు పాల్పడే వారికి పాఠాలు నేర్పించే సమయం  ఇది. బాధితులకు కాదు.  ఈ  సర్క్యులర్ ను  జేఎన్యూ  వెంటనే ఉపసంహరించుకోవాలి’  అని విమర్శించారు.

FAIMA:నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ !

ఇదిలా ఉండగా, అక్టోబర్ లో కర్ణాటక మంత్రి ఒకరు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహిళా నేతల ఆగ్రహానికి గురయ్యారు. కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ kr Ramesh kumar అత్యాచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేప్ అనివార్యమైనప్పుడు, పడుకుని ఆనందించండి” అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సభలో పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే రమేశ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ జోక్స్ వేసి ఎన్నోసార్లు పరువు పొగొట్టుకున్నారాయన. 

2019లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా వున్న రమేశ్ కుమార్ తనను తాను అత్యాచార బాధితుడితో  పోల్చుకున్నారు. పార్టీ నుంచి రూ.50 కోట్ల లంచం తీసుకున్నారంటూ యడియూరప్ప, ఇతర సీనియర్ నేతలు ఆయనపై ఆరోపణలు గుప్పిస్తూ ఆడియో టేప్ వైరల్ అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌లో తన పేరు వినిపించిన సమయంలో రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేపుల్లో తనపై ఆరోపణలు చేయడంతో రమేశ్ కుమార్ చర్చకు కేంద్ర బిందువుగా మారారు. ఆ సమయంలోనే తన పరిస్ధితి అత్యాచార బాధితురాలిగా వుందని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై మహిళా శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రమేశ్ కుమార్ సభకు క్షమాపణలు చెప్పారు. అత్యాచార బాధితురాలిని న్యాయస్థానంలో రేప్ బాధితురాలిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు పదే పదే గుచ్చిగుచ్చి అడగటాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశానని రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. 2020 సెప్టెంబర్‌లోనూ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరీని వెంటనే అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని చెబుతూ కూడా రమేశ్ కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

click me!