ఆ ముస్లీం యూనివర్సిటీలు రిజర్వేషన్లను ఎందుకు పాటించవు, యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

First Published Jun 25, 2018, 6:14 PM IST
Highlights

బీహెచ్‌యూ ఇస్తున్నపుడు ఎఎంయూ ఎందుకివ్వదంటూ ప్రశ్నించిన యోగి...

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ యూనివర్సీటీలు దళితులకు రిజర్వేషన్లు ఇచ్చినపుడు ముస్లీం యూనివర్సిటీలు ఎందుకు ఇవ్వవని ఆయన ప్రశ్నించారు. కన్నౌజ్ లో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ...రిజర్వేషన్ విధానంలో లోపాలున్నట్లు తెలిపారు.  

యూపీలోని బనారస్ హిందూ యూనివర్సిటీ రిజర్వేషన్ విధానానికి కట్టుబడి ఉన్నపుడు ఇదే రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీల్లో మాత్రం ఎందుకు రిజర్వేషన్లు ఉండకూడదు అంటూ యోగి ప్రశ్నించారు. ఈ విషయంపై దళిత రిజర్వేషన్ కోసం పోరాడేవారు సమాధానం చెప్పాలన్నారు. దళిత సోదరులకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఎప్పుడు కోరుతారో యెప్పాలని యోగి వారిని ప్రశ్నించారు. 

ఇటీవల కాంగ్రెస్ పార్టీ బిజెపిని దళిత వ్యతిరేక పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని యోగి విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులు, వాళ్ల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.


  
 

click me!