వివాహేతర సంబంధం: డబ్బుల కోసం ప్రియుడిని కొట్టి చంపిన లవర్

Published : Jun 25, 2018, 03:42 PM IST
వివాహేతర సంబంధం: డబ్బుల కోసం ప్రియుడిని కొట్టి చంపిన లవర్

సారాంశం

వివాహేతర సంబంధంతో ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

నోయిడా: పెళ్ళైన  వ్యక్తితో  వివాహేతర సంబంధం కొనసాగించింది. కొంత కాలానికి  వారిద్దరి మధ్య విబేధాలొచ్చాయి.  అయితే ఆ సమయంలో తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను ప్రియుడి భార్యకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. కొంతకాలానికి డబ్బులు ఇవ్వడం మానేసిన ప్రియుడిని పథకం ప్రకారం ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన  ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో సోనమ్‌ అలియాస్‌ సోను, జితేంద్రలు ధన్‌కౌర్‌లోని లోడిపూర గ్రామానికి చెందినవారు. వివాహితుడైన జితేంద్రకు కొన్ని నెలల కిందట సోనమ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలంపాటు వీరిద్దరి మధ్య బందంగా బాగానే ఉంది.  అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి.

 అప్పటినుంచీ తనకు డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో మన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు నీ భార్యకు పంపిస్తానంటూ జితేంద్రను సోనమ్‌ బెదిరించేది. డబ్బులిచ్చే ప్రసక్తే లేదని జితేంద్ర చెప్పడంతో ప్రియుడి హత్యకు ప్లాన్‌ చేసింది. 

ప్రియుడు జితేంద్రను  బిలాస్‌పూర్‌ ఏరియాకు రావాలని ఫోన్ చేసి కోరింది. జితేంద్ర అక్కడకు రాగానే రాడ్‌తో విచక్షణరహితంగా అతడిపై దాడి చేసింది. . కొద్దిసేపటికే జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం తన స్కూటర్‌పై సోనియా వెళ్లిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

జితేంద్రను ఎవరో హత్య చేశారని అతడి తమ్ముడు హతీమ్‌ సింగ్‌ ధన్‌కౌర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సోనియాపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమోదుచేసిన పోలీసులు సోనియాను అదుపులోకి తీసుకుని విచారించారు. జితేంద్రను హత్యచేసినట్లు అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన మంచం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

NASA Creates History Again!: సవాళ్ల నుంచి సక్సెక్ వరకు..భూమిపైకి సేఫ్‍గా వీరులు| Asianet News Telugu
ఆంధ్రాఅల్లుడికి PAKలో గ్రాండ్‌ వెల్కమ్‌ | JD Vance Meets PAK PM Shehbaz Sharif | Asianet News Telugu