ఉచితాల‌పై చ‌ర్చించేందుకు అఖిలపక్ష స‌మావేశాన్ని ఎందుకు పిలవకూడదు ?- కేంద్రానికి సుప్రీంకోర్టు ప్ర‌శ్న

By team teluguFirst Published Aug 24, 2022, 3:58 PM IST
Highlights

ఉచిత పథకాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది. 

ఉచిత ప‌థ‌కాలపై చర్చించడానికి కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవకూడదని సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

సీఎం సన్నిహితుడి ఇంటిలో ఏకే 47 రైఫిళ్లు.. కొనసాగుతున్న అక్రమ మైనింగ్ స్కామ్‌లో దర్యాప్తు

‘‘ఈ సమస్యను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం ఎందుకు ఒక కమిటీని వేయదు? దీనిని చర్చించడానికి కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవకూడ‌దు? ’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి కేంద్ర త‌ర‌ఫున హాజ‌రైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స‌మాధానం ఇచ్చారు. ఈ విష‌యంలో కేంద్రం అన్ని విధాల సాయం చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ‘‘ కమిటీ మూడు నెలల్లో నివేదికను సమర్పించవచ్చు. దానిని న్యాయ‌మూర్తులు ప‌రిశీలించ‌వ‌చ్చు ’’ అని ఆయన అన్నారు.

కాగా.. ఉచితాలపై చర్చలు జరిపేందుకు నాయకత్వం వహించడానికి కేంద్రం నాయకత్వం  నిరాకరించింది. దీంతో పాటు ఉచితాలపై సిఫార్సులు ఇవ్వడానికి కోర్టు ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేయాల‌ని కోరింది. అయితే దీనిపై సీజేఐ మాట్లాడుతూ.. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేదే అతిపెద్ద సమస్య అని అన్నారు. ఇది భారీ కాన్వాస్ అని చెప్పారు. “ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి రావచ్చు, కాబట్టి వారే వచ్చి దీన్ని నిర్వహించాలి. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉచిత ప‌థ‌కాల‌ను ప‌రిశీలించాలి. దీనిపై నేను ఒక మాండమస్‌ని పాస్ చేయలేను. కాబట్టి దీనిపై చ‌ర్చ అవ‌స‌రం ’’ అని ఆయన అన్నారు. 

నలుగురు ఎమ్మెల్యేల‌ను లాక్కునేందుకు బీజేపీ 20 కోట్లు ఆఫ‌ర్ చేసింది - ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ

బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఉచితాలకు అనుకూలంగా ఉన్నాయని, కాబట్టి దీనిని ఎదుర్కోవ‌డానికి న్యాయపరమైన ప్రయత్నం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నికల సమయంలో పార్టీల ‘ఉచితాల’ వాగ్దానాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ పై చర్చిస్తూ మంగళవారం కోర్టుఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ మాకు కాలక్షేపం చేసే హక్కు లేదు. సమస్యలను చూసే హక్కు లేదు.. చూడండి, రేపు ఎవరైనా మా వద్దకు వచ్చి తాము పథకం లబ్ధిదారులం కాదు అని చెబితే.. మేము కాదు అని చెప్పగలమా? దీనితో మేము వ్యవహరించలేము. మనం దానిని సమతుల్యం చేసుకోవాలి. మేము ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం కాదు. మేము ఏ పథకాలకూ వ్యతిరేకం కాదు, ’’ అని ధర్మాసనం పేర్కొంది.

‘భారత్ జోడో యాత్ర’ కు మావోయిస్టుల బెదిరింపు సెగ.. రూట్ మ్యాప్ నుంచి ఛత్తీస్ ఘడ్ ను తప్పించిన కాంగ్రెస్..

ఉచిత ప‌థ‌కాల‌పై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రాజకీయ పార్టీలు త‌మ లబ్ది కోసం ఏకపక్ష వాగ్దానాలు లేదా అహేతుకమైన ఉచితాలను ఇస్తూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్శిచ‌డం లంచం, మితిమీరిన ప్రభావాలకు సమానమని పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉచితాల పంపిణీ ఓటర్లను అనవసరంగా ప్రభావితం చేయగలదని, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల బేస్ ను కదిలించగలదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తుంద‌ని చెప్పారు. కాగా.. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్న నేప‌థ్యంలో ఈ అంశాన్ని ఇప్పుడు కొత్త న్యాయమూర్తుల బెంచ్ విచారించనుంది.

click me!